ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్... ఆ యంగ్ హీరో కూడా ..?
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో మరో యువ హీరో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడన్న వార్తలు ఆసక్తిగా మారాయి. త్రివిక్రమ్ గత సినిమాలు అయిన అజ్ఞాతవాసి సినిమాలో ఆది పినిశెట్టి, అరవిందే సమేత వీరరాఘవలో నవీన్‌చంద్ర, అల వైకుంఠపురములో సుశాంత్ కీలకపాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం మరో యంగ్ హీరోను త్రివిక్రమ్ నటింపజేసే ప్లాన్‌లో ఉన్నాడట. కరోనా తర్వాత ఈ పాత్రను ఎవరు చేస్తారన్నదానిపై క్లారిటీ రానుంది.