మాస్క్ కుట్టిన మొదటి మహిళ...!
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వేగంగా విజృంభించడంతో దేశవ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది. మాస్కుల తయారీ కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాల సహాయసహకారాలు తీసుకుంటున్నాయి. అయితే దేశంలో కరోనాతో ప్రజలు భయందోళనకు గురవుతున్న సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భార్య , ప్రథమ మహిళ సవితా కోవింద్ చేసిన పనిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
రాష్ట్రపతి భార్య సవితా కోవింద్ మాస్కులు కుట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా కట్టడి కోసం తాను సైతం అంటూ సవితా కోవింద్ ముందుకు వచ్చి రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లోని శక్తిహాట్ వద్ద మిషనుపై పేస్ మాస్క్‌లు కుట్టారు. స్వయంగా మిషన్ కుట్టి తాను కరోనా మహమ్మారితో పోరాడగలనని ఆమె నిరూపించారు. ఎరుపు రంగు మాస్క్ ధరించి మాస్కులు కుట్టిన ప్రథమ మహిళ తాను కుట్టిన పేస్ మాస్క్‌లను ఢిల్లీలోని అర్బన్ సెంటర్లలో పంపిణీ చేయాలని నిర్ణయించారు.
వైద్య నిపుణులు ముఖానికి మాస్కులు ధరించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని సూచించడంతో ఆమె మాస్కులు కుట్టారు.
Delhi: First Lady Savita Kovind stitched data-face masks at shakti Haat in the President’s Estate. The masks stitched at shakti Haat are being distributed at various shelter homes of delhi Urban Shelter Improvement Board (22.04.2020) pic.twitter.com/CwtLvnqht6 — ANI (@ANI) April 22, 2020