
తెలంగాణ సీఎంకు మల్లారెడ్డి విరాళం అదిరిందిగా... !
కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి చేదోడుగా పలు సంస్థలు, అనేకమంది దాతలు ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఉన్నోళ్లు లేరు.. పేదలు లేరు.. చివరకు తెలంగాణలో సిరిసిల్ల లాంటి జిల్లాలో అయితే విస్తరాకులు కుట్టుకునే ఓ ముసలావిడ సైతం విస్తరాకులు కుట్టగా వచ్చిన రు. 20 వేలను కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ పైళ్ల మల్లారెడ్డి ఒక కోటి 116 రూపాయలను సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. తాను అందిచాలనుకున్న మొత్తాన్ని ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో మల్లారెడ్డి ఈ చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. అదేవిధంగా ధనలక్ష్మీ ట్రేడర్స్ సీఎం సహాయనిధికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించింది. ఈ విరాళం మొత్తాన్ని మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధి రమేశ్‌కుమార్ చౌదరి మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple