క‌రోనా ఎఫెక్ట్‌: 58 ఏళ్ల‌లో ఇదే మొదటిసారి...

Kaumudhi

క‌రోనా వైర‌స్ సృష్టిస్తున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌తిష్టాత్మ‌క ఉత్స‌వాలు, టోర్నీలు అయివా ప‌డుతున్నాయి. ఇందులో కొన్ని ర‌ద్దు కూడా అయ్యాయి.. తాజాగా.. ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  కేరళలో ప్ర‌తీ సంవ‌త్స‌రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుపుకునే త్రిస్సూర్‌ పూరమ్‌ ఉత్సవాలను ర‌ద్దు చేసింది.  దేశ‌వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగిందించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఏడాది జరగాల్సిన ఉత్సవాలను రద్దుచేశామని ప్రభుత్వం ప్రకటించింది.

 

ఇలా ఉత్సవాలు జరగకుండా ఉండడం గత 58 ఏండ్లలో ఇదే మొదటిసారని ప‌లువురు అంటున్నారు. ఇక‌ ప్రతిఏటా రెండు నెల్లపాటు జరిగే పూరమ్‌ ఎగ్జిబిషన్‌ ఏప్రిల్‌ 1న ప్రారంభం కావాల్సిఉన్నప్పటికీ లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌డంతో ఆ ఎగ్జిబిష‌న్ కూడా ర‌ద్దు అయింది. ఇదిలా ఉండ‌గా.. కేర‌ళ‌లో కూడా క‌రోనా వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. రోజురోజుకూ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: