
బీజేపీ ఎమ్మెల్యే లాక్ డౌన్ ఉల్లంఘన.. పుట్టిన రోజు వేడుకలు...
ఓ వైపు దేశం మొత్తం లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడిక్కడ స్థంభించిన పోయి ఉన్నాయి. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా లాక్ డౌన్ ని పాటిస్తూనే ఉన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ఉల్లంఘన చేయొవొద్దని హెచ్చిరిస్తూనే ఉన్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే ప్రధాన ఆయుధం అని అందరూ భావిస్తుంటే, ఈ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం అదేమీ పట్టనట్టు వందల మంది సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు.
కర్ణాటకలోని తుముకూరు జిల్లా తురువెకిరె నియోజవకర్గ ఎమ్మెల్యే ఎం.జయరామ్ శుక్రవారం నాడు గుబ్బి పట్టణంలో ఆట్టహాసంగా జన్మదినం జరుపుకున్నాడు. అక్కడ జనాలు గుంపులు గుంపులుగా కూడారు.. కనీసం ముఖానికి మాస్క్ కూడా ధరించలేదు. ఈ బర్త్ డే ఫంక్షన్ కు హాజరైన వారిలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ వేడుకలో అతిథులకు వేడివేడి బిర్యానీ వడ్డించారు. కనీస భద్రత లేకుండా.. సామాజిక దూరం పాటించకుండా ఇక్కడి వచ్చిన వారు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కార్యక్రమానికి వచ్చిన వారితో సదరు ఎమ్మెల్యే ఎంతో ఉత్సాహంగా ఫొటోలు దిగి కరోనా లాక్ డౌన్ స్ఫూర్తిని అపహాస్యం చేశాడు. తాజాగా ఈ ఫోటోలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కర్ణాటకలో 207 కరోనా కేసులు నమోదవగా ఆరుగురు చనిపోయారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple