బర్త్ డే : తారక్ జానుభాయ్... పేరు వింటేనే కితకితలు !

Vimalatha
నేడు ప్రముఖ కమెడియన్ తారక్ జానుభాయ్ మెహతా జయంతి. తారక్ ఒక భారతీయ హాస్య నటుడు, రచయిత మరియు నాటక రచయిత. ఆయన 'ఉంచా చష్మా కాలమ్‌' తో బాగా పేరు సంపాదించాడు. గుజరాత్‌ లో చాలా కామెడీ షోలు చేశాడు. అతను గుజరాతీ థియేటర్‌ కి సుపరిచితుడు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఈయన తెలియకపోయినా కూడా ఆయన ఒక పద్మశ్రీ గ్రహీత. ఈరోజు తారక్ బర్త్ డే కాబట్టి ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
తారక్ మొదటి కాలమ్ చిత్ర లేఖ లో మార్చి 1971 లో వచ్చింది. అప్పట్లో ఆయన రాసిన 80 పుస్తకాలు ప్రచురించబడడం విశేషం. వాటిలో 3 గుజరాత్ వార్తా పత్రిక లో అతని కాలమ్‌ లో ఉన్నాయి. మిగిలినవి తారక్ మెహతా కా ఊల్తా చష్మా కథల నుండి సంకలనం చేయబడ్డాయి. 2008 సంవత్సరం లో SAB tv తారక్ మెహతా కాలమ్ ఆధారంగా తారక్ మెహతా కా ఊల్తా తష్మా అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ షోలో తారక్ మెహతా పాత్రలో నటుడు శైలేష్ లోధా నటించారు. ఈ కార్యక్రమం అత్యంత తక్కువ సమయం లోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక నేటికీ ఈ ప్రదర్శన ప్రసిద్ధ కామెడీ షోలలో ఒకటి. తారక్ జాను భాయ్ మెహతాకు 2015 లో పద్మశ్రీ అవార్డు లభించగా, 2011 లో సాహిత్య గౌరవ్ అవార్డు తో సత్కరించారు. ఆయన హాస్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన పేరును తలచుకుంటే చాలు ప్రేక్షకుల ముఖాల్లో చిరు నవ్వు వికసిస్తుంది.
తారక్ జాను భాయ్ 2017 సంవత్సరంలో మరణించడంతో గుజరాత్ పరిశ్రమ మాత్రమే కాదు, ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. ఆయన మరణం తరువాత, కుటుంబం అతని శరీరాన్ని వైద్య పరిశోధనలకు దానం చేసింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తారక్ జాను భాయ్ ని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: