రజినీకాంత్ @ 71 : తలైవా గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు

Vimalatha
సినిమాల్లో నెగెటివ్ పాత్రలతో పాటు పాజిటివ్ పాత్రలతో అభిమానులకు నచ్చే అతికొద్ది మంది నటుల్లో రజనీకాంత్ కూడా ఒకరు. 45 ఏళ్లకు పైగా తన కెరీర్‌లో సూపర్ స్టార్ అన్ని వయసుల అభిమానులను సంపాదించుకున్నాడు. నటనతో పాటు నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు. భారత చలనచిత్ర ప్రపంచానికి ఆయన చేసిన అద్భుతమైన కృషికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఇటీవలే పద్మశ్రీ కూడా ఇచ్చి సత్కరించారు. ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు ఈ సందర్భంగా తలైవా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
1. 1950 డిసెంబర్ 12న జన్మించిన రజనీ సినిమా పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించక ముందు బస్ కండక్టర్, కార్పెంటర్, కూలీగా ప్రారంభించారు.
4. రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్.
5. అతను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో డిప్లొమా చదివాడు. కోర్సులో తమిళం కూడా నేర్చుకున్నాడు.
6. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నెగెటివ్ రోల్స్ మాత్రమే వచ్చాయి. అతను క్లాసిక్ చిత్రంగా పరిగణించే "భావునా ఒరు కెల్విక్కురి"లో సానుకూల పాత్రను పోషించాడు.
7. బాలీవుడ్ చిత్రాల 11 రీమేక్‌లలో రజినీకాంత్ చేశారు. ఆ రీమేక్ చిత్రాలలో ఎక్కువగా అమితాబ్ బచ్చన్ సినిమాలే ఉండడం విశేషం. ఆ రీమేక్ చిత్రాలన్నీ సూపర్‌ హిట్ బ్లాక్‌ బస్టర్స్.
8. 1988లో రజనీకాంత్ టెన్నిస్ లెజెండ్ అశోక్ అమృతరాజ్ సహ నిర్మాత అయిన "బ్లడ్‌ స్టోన్‌"లో నటించారు. డ్వైట్ హెచ్ లిటిల్ దర్శకత్వం వహించిన ఇది రజనీకాంత్ ఏకైక హాలీవుడ్ చిత్రం.
9. ఆయన తన సినిమా పబ్లిక్ స్క్రీనింగ్‌ లకు ఎప్పుడూ హాజరుకాడు. ప్రతి సినిమా తర్వాత విరామం తీసుకొని విహార యాత్రకు వెళ్తాడు.
11. రజిని ఎప్పుడూ చెన్నైలో తన పుట్టినరోజును జరుపుకోడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పుట్టిన రోజు వేడుకల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా తోపులాటలో ముగ్గురు అభిమానులు మరణించారు.
12. తమిళ చిత్ర పరిశ్రమ ఇంతగా అభిమానించే సూపర్ స్టార్ నిజానికి ఒక మహారాష్ట్రీయుడు. ఆయన అనేక ప్రాంతీయ భాషా చిత్రాలలో చేశాడు.
13. జాకీ చాన్ తర్వాత వినోద పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో రజనీ రెండవ స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: