సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న 'శుభలేఖ' సుధాకర్

Vimalatha
కొంతమంది సినిమా తారలకు వాళ్లు చేసిన సినిమాలే ఇంటి పేరుగా మారిపోతుంటాయి. అలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. మొదటి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న వారు కొందరైతే, తమకు అదృష్టం తెచ్చిపెట్టిన సినిమాలలో ఇంటి పేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. అందులో ఒకరు శుభలేఖ సుధాకర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును తెచ్చుకున్న శుభలేఖ సుధాకర్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సన్నగా ఉండే ఆయన తనకు వచ్చిన పాత్రలోకి మాత్రం పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శుభలేక సుధాకర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
సుధాకర్ రియల్ పేరు సురావజ్జల సుధాకర్. 1960 నవంబర్ 19న జన్మించిన ఆయన చదువు పూర్తవగానే సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మద్రాస్ లో సినిమా ప్రయత్నంలో ఉండగా కె.విశ్వనాథ్ రూపొందిస్తున్న శుభలేఖ అనే సినిమాలో ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన తర్వాత కీలక పాత్ర సుధాకర్ దే. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. అందులోనూ నటించిన సుధాకర్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటికే సుధాకర్ అనే పేరుతో మరో నటుడు చిత్రసీమలో ఉండడంతో ఈయన తన పేరును శుభలేఖ సుధాకర్ గా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు మంచి విజయాలే వచ్చాయి.
సితార, మంత్రిగారి వియ్యంకుడు, రావు గోపాల్ రావు, జననీ జన్మభూమి, స్వాతి, ప్రేమించు పెళ్ళాడు, అహ నా పెళ్ళంట, ఆదిత్య 369, పెళ్లి పుస్తకం, శివ, గౌతమీపుత్ర శాతకర్ణి, భైరవ ద్వీపం వంటి అద్భుతమైన చిత్రాలను ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సుధాకర్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.
శుభలేఖ సుధాకర్ దివంగత దిగ్గజ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి శైలజ ని వివాహం చేసుకున్నారు. శుభలేఖ సుధాకర్, శైలజ దంపతులకు ఒక కుమారుడు. అతని పేరు శ్రీకర్. దరికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగి పోతున్నారు సుధాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: