అందంలో, అభినయంలో సూర్య కోటి ప్రభ

Vimalatha
అలనాటి నటి సూర్యప్రభ పుట్టినరోజు నేడు. 1958 అక్టోబర్ 20న జన్మించిన ప్రభాస్ పూర్తి పేరు కోటి సూర్య ప్రభ. లలిత కళల్లో మంచి చి అభిరుచి ఉన్న ఇంట్లో పుట్టడం వల్ల ప్రభకు బాల్యంలోనే నాట్యంపై మక్కువ ఏర్పడింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు కూచిపూడి లో నాట్య శిక్షణ ఇప్పించారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ లో చేరి ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం దగ్గర శిక్షణ పొందారు ఆమె. అందమైన అభినయంతో, మంచి రూపంతో ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకునే ప్రభాస్ మొదటి చిత్రం నీడలేని ఆడది. 

ఆ తర్వాత ఆమె అన్నదమ్ముల కథ, అమ్మాయిలు జాగ్రత్త, రామయ్య తండ్రి, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అక్కినేని మహాకవి క్షేత్రయ్య లో రుక్మిణి అనే పాత్రలో నటించారు. ఇక ఎన్టీఆర్ తిరుపతిరావు నయం చేసిన దాన వీర శూర కర్ణ లో రా రాజు భార్య భానుమతి గా అలరించారు. చిత్రం భళారే విచిత్రం అంటూ ఎన్టీఆర్ సరసన ఆడిపాడారు. అప్పటిదాకా సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రభ ఈ సినిమాతో ఒక్కసారిగా హీరోయిన్గా అవకాశాలు పొందడం మొదలు పెట్టింది.

నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన సూర్య ప్రభను దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకులు ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆమె ఎన్టీఆర్ తో శ్రీమద్విరాట పర్వము చిత్రంలో సత్యభామ గా కనిపించారు ఆమె. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీమద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో వేమన ఎపిసోడ్ లో విశ్వద గా నటించారు. ఇక ఏఎన్ఆర్ సరసన మహాత్ముడు సినిమాలో కీలక పాత్ర పోషించారు. సూపర్ స్టార్ కృష్ణ తో కొల్లేటి కాపురం లో హీరోయిన్ గా నటించారు. తర్వాత కాలంలోనూ పలు పాత్రల్లో నటించి మెప్పించారు. ఇటీవల వచ్చిన సాయి ధరమ్ తేజ్ చిత్రం ప్రతి రోజు పండగే లో ప్రభ కీలక పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: