రకుల్ మొదటి చిత్రం ఏంటో తెలుసా?

Vimalatha
పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతోంది. అందం అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు.

 
రకుల్ 1990 అక్టోబర్ 10న న్యూఢిల్లీ లో నివాసం ఉంటున్న ఓ పంజాబీ కుటుంబంలో జన్మించింది. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి ఆర్మీ ఆఫీసర్. తల్లి గృహిణి. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో రకుల్ బాల్యమంతా ఆర్మీ పబ్లిక్ స్కూల్ లోనే గడిచింది. అనంతరం ఆమె జీసస్ అండ్ మేరీ అనే కళాశాలలో మ్యాథ్స్ లో పట్టా అందుకుంది. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ పై మక్కువ ఏర్పడింది. ఆ అభిరుచి తోనే కాలేజీలో ఏర్పాటు చేసే ఫ్యాన్సీ షోస్ లో తన ప్రత్యేకత చాటుకున్నది రకుల్. డిగ్రీ పూర్తి చేసే సమయంలోనే మొదటి చిత్రం 'గిల్లీ' లో అవకాశం వచ్చింది.

అయితే ఇది కన్నడ చిత్రం. ఆ తర్వాత ఆమె 'కెరటం' అనే తెలుగు సినిమాలో కథానాయికగా వచ్చింది. కానీ రకుల్ కు పేరు తీసుకు వచ్చింది మాత్రం సందీప్ కిషన్ హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' మూవీ. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం ప్రారంభమైంది. తరువాత వరుసగా రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేసుకో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్, జయ జానకి నాయక వంటి చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన 'కొండపొలం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు అవకాశం ఉన్న డిగ్లామర్ రోల్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. మరి మరిన్ని మంచి సినిమాతో ఆమె ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: