'కట్టప్ప' పుట్టినరోజు

Vimalatha
దక్షిణ భారతదేశంలోని నట దిగ్గజాలలో సత్య రాజ్ ఒకరు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో పని చేసిన ఆయన వివిధ భాషల్లోనూ నటించి మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బాహుబలి తో వచ్చింది. బాహుబలి సినిమాలో కట్టప్ప గా నటించిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే వెలకట్టలేని అభిమానం కూడా ఈ పాత్ర ద్వారా దక్కించుకున్నారు. ఈరోజు మన కట్ట పుట్టినరోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 
1954 అక్టోబర్ 3 న జన్మించిన సత్యరాజ్ తన ప్రాథమిక పాఠశాల విద్యను సెయింట్ నుండి తమిళంలో పూర్తి చేశారు. మేరీస్ కాన్వెంట్, కోయంబత్తూర్. అతను కోయంబత్తూరు రాంనగర్‌లోని సబర్బన్ ఉన్నత పాఠశాల నుండి పదవ వరకు విద్యను పూర్తి చేశాడు. తరువాత కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చేరాడు మరియు వృక్షశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. సత్యరాజ్  ముఖ్యంగా తమిళ సినిమాల్లో నటించారు. అయితే ఒక తమిళంలోనే కాకుండా తెలుగు మలయాళం, హిందీ, కన్నడ చిత్ర సీమల్లో కూడా తన మార్క్ చాటుకున్నారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఆయన నిష్కళంకమైన నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడు, మీడియా పర్సన్, మాజీ రాజకీయ నాయకుడిగా కూడా విశేష ఆదరాభిమనలను అందుకున్నారు. ఆయన సినిమా రంగంలో చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించారు. విలన్ పాత్ర నుంచి హీరో వరకు వెండితెరపై ఆయన చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా ఆయన నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.

 
నడిగస్ - 1990 లో విడుదలైన ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. పి.వాసు దర్శకత్వంలో కుష్బూ హీరోయిన్ గా నటించింది. 

 
పెరియార్-సామాజిక సంస్కర్త, అది పెరియార్ రామస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోనూ సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్.


బాహుబలి- పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కథలోని సత్య రాజ్ కట్టప్ప గా కనిపించి ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: