బర్త్ డే : భార్యతో ఆయుష్మాన్ ఖురానా ప్రేమాయణం... విచిత్ర ప్రేమ కథ !

Vimalatha
నటనతో అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా పుట్టినరోజు నేడు. ఆయుష్మాన్ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేడు ఆయుష్మాన్ సంపాదించుకున్న స్థానంలోకి పెద్ద పెద్ద తారలు సైతం చేరుకోలేకపోయారు. బాలీవుడ్ లో ఈ స్టార్ స్థానం అంత ప్రత్యేకమైనది. అయితే భార్య తాహిరాతో ఆయుష్మాన్ ప్రేమ కథ చాలా చిత్రంగా ఉంటుంది. ప్రేమలో మునిగిపోయిన వ్యక్తి ఏదైనా చేస్తాడని అంటారు. బాలీవుడ్‌లో కూడా అలాంటి స్టార్లు చాలా మంది ఉన్నారు. అందులో అక్కడ ప్రేమ కథలు ఇంటరెస్టింగ్ గా సాగుతాయి. వారిలో ఒకరు ఆయుష్మాన్ ఖురానా అండ్ తాహిరా. అలాగే వీరి ప్రేమ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తన కెరీర్‌లో చాలా కష్టపడిన ఆయుష్మాన్ ప్రేమ కథను నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం.
ఆయుష్మాన్ ఖురానా మరియు తాహిరా ప్రేమ కథ ఫిజిక్స్ కోచింగ్ క్లాస్‌తో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇద్దరూ 11-12వ తరగతి చదువుతున్నారు. అలా పరిచయమైన వారి స్నేహం తరువాత ప్రేమగా మారింది. అయితే ఒకరోజు ఆయుష్మాన్, తాహిరా తండ్రి ఇరు కుటుంబాలు కలిసి ఇంట్లో భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఆ జంటకు తెలియదు. సాయంత్రం రెండు కుటుంబాలు విందు కోసం సమావేశమైనప్పుడు ఆయుష్మాన్, తాహిరా ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోయారు. ట్యూషన్ చదివిన తర్వాత ఇద్దరూ కలిసి వచ్చారు. ఆ సమయంలో వారిద్దరికీ తెలియదు వారి కుటుంబ సభ్యులు ఇలా కలవబోతున్నారని. పాఠశాల నుండి ప్రారంభమైన వారిద్దరి ప్రేమ కథ ఇప్పటికి అలాగే కొనసాగుతోంది. ఇద్దరూ కలిసి చండీగఢ్‌లో థియేటర్ ఆర్ట్స్ చేసారు. తొలిచూపులోనే వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. ఆయుష్మాన్ మొదట తన సోదరుడు అపర్శక్తికి తాహిరా గురించి చెప్పాడట.
వివాహం తర్వాత కూడా ఇద్దరూ నాలుగు సంవత్సరాల పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో ఉన్నారట. ఆ సమయంలో ఆయుష్మాన్ ఖురానా ముంబైలో, చండీగఢ్‌లో తాహిరా నివసించారు. అప్పటికి అతని మొదటి కుమారుడు విరాజ్ కూడా జన్మించాడు. వారిద్దరికీ ఒక కుమార్తె పుట్టాక తాహిరా ముంబైకి మారింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ వారి సంబంధాన్ని ఇంకా బలోపేతం చేసింది. తాహిరా క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు ఆయుష్మాన్ ఆమెకు అడుగడుగునా మద్దతు ఇచ్చాడు. నేడు ఈ అందమైన జంట తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఇద్దరూ బాలీవుడ్ ఉత్తమ జంటగా ఆదర్శనీయంగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: