బర్త్ డే : ఆశా భోంస్లే గురించి ఆసక్తికరమైన విషయాలు

Vimalatha
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ గాయని ఆశా భోంస్లే పుట్టినరోజు నేడు. ఆమె సెప్టెంబర్ 8, 1933న మహారాష్ట్రలో జన్మించారు. ఈరోజు ఆమె తన 88వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకుంటుంది. ఆశా భోంస్లే తన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం కారణంగా అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఈరోజు మనం ఆమె జీవితానికి సంబంధించిన ఇంకా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఆమె కేవలం 10 సంవత్సరాల వయస్సులో పాడటం ప్రారంభించారు. ఆశా భోంస్లే తన కెరీర్‌లో 20 భాషల్లో 16 వేలకు పైగా పాటలు పాడారు. తన మ్యాజికల్ వాయిస్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె సాంగ్స్ చాలా స్టూడియోలలో రికార్డింగ్‌ అయ్యాయి. దీనికి గానూ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఆశా భోంస్లే స్వర్ కోకిల లతా మంగేష్కర్ చెల్లెలు.
31 ఏళ్ల వ్యక్తితో వివాహం
గాయని ఆశా భోంస్లే 16 ఏళ్ల వయసులో 31 ఏళ్ల గణపత్రావ్ భోస్లేను వివాహం చేసుకుంది. ఈ వివాహాన్ని ఆశా తన కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది. గణపత్ రావు లతా మంగేష్కర్ వ్యక్తిగత కార్యదర్శి. అప్పట్లోఇద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత వివాహం చేసుకున్నారు. కానీ వారి వైవాహిక బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. దీంతో వారు విడాకులు తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆశా భోంస్లే గణపత్ రావును కుటుంబం తనను అంగీకరించలేదని చెప్పింది.
ఆర్డీ బర్మన్ రెండో వివాహం:
గణపత్ రావుతో విడాకులు తీసుకున్న తర్వాత ఆశాభోంస్లే జీవితంలోకి ఆర్డీ బర్మన్ వచ్చారు. ఆమె ఆయనతో మరోసారి ప్రేమలో పడింది. ఆశా, ఆర్డీ బర్మన్ 'తీస్రీ మంజిల్' సినిమా సమయంలో కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి చాలా పాటలకు పని చేశారు. ఆ సమయంలోనే ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు, ప్రేమలో పడ్డారు. 1980లో ఆశా, ఆర్డీ బర్మన్ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 14 సంవత్సరాల తర్వాత ఆర్డీ బర్మన్ ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: