బర్త్ డే : పడి లేచిన కెరటం సుమన్

Vimalatha
రియల్ హీరో సుమన్ పుట్టిన రోజు నేడు. సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అనుకోకుండా ఆయన ఓ కేసులో ఇరుక్కున్న ఒకేసారి ఆయన జీవితాన్ని నాశనం చేసింది. ఆ తర్వాత ఆయన చిన్న పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకప్పుడు హీరో అంటే అలా ఉండాలి అనుకునేవారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆయన ఒడ్డు పొడుగు, అందం అలాంటిది. పైగా మాస్టర్ పై ఆయనకున్న గ్రిప్ యాక్షన్ హీరోగా ఇండస్ట్రీలోని నిలబెట్టింది. నిజమైన హీరోలకు ఉండాల్సిన అన్ని లక్షణాలు కనిపించడంతో ఎంతోమంది అభిమానులు ఆయనకు ఫిదా అయ్యారు. కానీ అప్పట్లో సుమన్ మీద నమోదైన గుండా చట్టం సంచలనం సృష్టించింది.
తన స్నేహితుడు కారణంగానే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని సుమన్ ఎప్పుడూ చెప్తాడు. తమిళ చిత్రాల్లో నటిస్తున్న సుమన్ ను స్నేహితుడు భానుచందర్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చారు. సుమన్, భానుచందర్ చిత్ర పరిశ్రమలో చాలా మంచి స్నేహితులు. ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యం ఉండడంతో అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సుమన్ కు తెలుగు ప్రేక్షకుల నుండి అనూహ్య స్థాయిలో, అనుకోని రీతిలో ఆదరణ లభించింది. తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో తెరపై వెంకటేశ్వరుని పాత్రలు పోషించాలంటే ఎన్టీఆర్ తర్వాత సుమన్ మాత్రమే అన్నంత గొప్పగా కనిపించేవారు. సుమన్ కు అమ్మాయిల నుంచి చాలా ప్రేమలేఖలు వచ్చేది. ఏదేమైనా ఇలాంటి అద్భుతమైన వ్యక్తి కెరీర్ ఓ కేసులో చిక్కుకుని ఆగిపోవడం బాధాకరం. అయినప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకొని ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్న సుమన్ కెరీర్ అద్భుతంగా సాగాలని కోరుకుంటూ ఇండియా హెరాల్డ్ తరఫునుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: