బర్త్ డే : 1960-80లలో బాలీవుడ్ ను ఏలిన ఎవర్ గ్రీన్ క్వీన్

Vimalatha
ఎవర్ గ్రీన్ బాలీవుడ్ నటి సైరా బాను 78వ పుట్టినరోజు నేడు. 1963 నుండి 1969 వరకు బాను హిందీ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. 1971 నుండి 1976 వరకు పారితోషికం పొందిన నాల్గవ అత్యధిక నటి. అప్పట్లో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన క్వీన్. 1960లోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాను 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆమె మొదటి చిత్రం చేసింది. 1961లో విడుదలైన "జంగ్లీ" చిత్రంలో షాను కపూర్‌తో కలిసి బాను తొలిసారిగా వెండి తెరపై కన్పించింది. ఈ చిత్రం ఆమెను ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ నామినేషన్‌ను సంపాదించి పెట్టింది.
షమ్మీ కపూర్ సరసన మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన "బ్లఫ్ మాస్టర్‌" ఆమెకు మంచి సక్సెస్ ను ఇచ్చింది. "జుక్ గయా అస్మాన్", "ఆయి మిలన్ కీ బేలా", రాజేంద్ర కుమార్ "ఏప్రిల్ ఫూల్", బిశ్వజీత్ "ఏవో ప్యార్ కరెన్", జాయ్ ముఖర్జీతో "షాగీర్డ్‌", దేవ్ ఆనంద్‌తో కలిసి "ప్యార్ మొహబ్బత్" వంటి చిత్రాలతో అద్భుతమైన హిట్ లను సాధించారు.

 
ఆమె సూపర్ స్టార్ దిలీప్ కుమార్‌ను వివాహం చేసుకుంది. బాను, దిలీప్ కుమార్‌ ల వివాహం అక్టోబర్ 11, 1966లో జరిగింది. వివాహ సమయంలో బాను వయస్సు 22 మరియు కుమార్ వయస్సు 44 సంవత్సరాలు. ఈ దంపతులకు పిల్లలు లేరు. భాను పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించారు.  రాజేంద్ర కుమార్ సరసన వచ్చిన అమన్ (1967) మూవీ ఆమె పెళ్లి తరువాత వచ్చిన మొదటి మూవీ. ఆమె మనోజ్ కుమార్ తో మూడు చిత్రాలలో నటించారు. షాది, పూరబ్ ఔర్ పశ్చిమ్, ఆత్మా త్యాగ్. 1968లో సునీల్ దత్ తో కలిసి చేసిన కల్ట్ ఫిల్మ్ "పడోసన్" ఆమెను బాలీవుడ్ లో టాప్ లీగ్‌కు చేర్చింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆమె హీరోయిన్‌గా కొనసాగారు.

"విక్టోరియా నెం 203" చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆమె తన భర్తతో కలిసి మూడు సినిమాల్లో నటించింది. అందులో "గోపి" మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఆమె ధర్మేంద్రతో కలిసి 6 సినిమాలలో నటించింది. అందులో 5 సూపర్హిట్.  షాగిర్డ్ (1967), దివానా (1968), సాగినా  (1974) చేసింది. దునియా (1984)లో తన భర్త సరసన అతిధి పాత్రలో కనిపించింది. ఇందులో "తేరి మేరి జిందగీ" పాట బాగా ప్రాచుర్యం పొందింది. "పైలా" 1988 లో విడుదలైంది. అదే భాను చివరి చిత్రం. అయితే ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ రాజేష్ ఖన్నాతో మాత్రం నటించలేకపోవడం బాధగా ఉందని చెప్పుకొచ్చింది. కాగా 2021 జూలై 7న దిలీప్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: