సామాన్యుడి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా... సత్య నాదెళ్ల జీవితం స్ఫూర్తిదాయకం

Vimalatha
దేశ ప్రతిష్టను పెంచిన భారతీయులలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఒకరు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా ఉన్న సత్య నాదెళ్ల 7 సంవత్సరాల పాటు కంపెనీ సీఈఓగా ఉంటూ మైక్రోసాఫ్ట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. తన పట్టుదల, కృషి తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సత్య నాదెళ్ల బర్త్ డే నేడు. ఈ సందర్భంగా అందరికీ స్ఫూర్తిదాయకమైన ఆయన విజయ యాత్ర గురించి తెలుసుకుందాం.
సత్య నాదెళ్ల 19 ఆగస్టు 1967 న హైదరాబాద్‌లో జన్మించారు. అతని తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ పరిపాలనా అధికారి, తల్లి ప్రభావతి యుగంధర్ సంస్కృత లెక్చరర్. సత్య తన ప్రాథమిక విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేశాడు. ఆ తర్వాత 198 లో మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, 1996లో చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు.
ఎంబీఏ డిగ్రీ తీసుకున్న తర్వాత నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ఇక్కడ అతను అనేక పెద్ద ప్రాజెక్టులపై పనిచేశాడు. అందులో అతను ఆన్‌లైన్ సేవలు, ప్రకటనలు, సాఫ్ట్‌వేర్, గేమింగ్‌పై పనిచేశాడు. కంపెనీకి కొత్త దిశానిర్దేశం చేశాడు. దీనిలో xbox గేమింగ్ సేవ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌ని ప్రారంభించి కంపెనీని ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లలో ఒకటిగా నిర్మించడంలో కీలకపాత్ర పోషించాడు. సత్య నాదెళ్ళను ప్రపంచవ్యాప్తంగా 'క్లౌడ్ గురు' అని కూడా అంటారు. క్లౌడ్ అనేది ఇంటర్నెట్‌లో పూర్తిగా ప నిచేసే సేవ. దాని సంబంధిత సేవలు లేదా కంప్యూటర్ ఫైల్‌లు ప్రపంచంలోని ఏ మూలలోనైనా ఇంటర్నెట్ ద్వారానైనా ఉపయోగించవచ్చు.
మైక్రోసాఫ్ట్ 2014లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు సత్య నాదెళ్ళను కంపెనీ సీఈఓగా నియమించారు. అతను తన పనిని చక్కగా నిర్వహించి కంపెనీని మంచి స్థాయికి తీసుకెళ్లాడు. అతని హయాంలో మైక్రోసాఫ్ట్ షేర్ల విలువ ఏడు రెట్లు పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ $ 2 ట్రిలియన్లకు చేరుకుంది. సత్య నాదెళ్ల కంటే ముందు బిల్ గేట్స్, థామ్సన్ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ పదవిని నిర్వహించారు. నాదెళ్ల కంపెనీకి మూడవ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అతను ఛైర్మన్ అయిన తర్వాత, థామ్సన్ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఆయన వ్యక్తిగత విషయానికొస్తే... నాదెళ్ల తన స్కూల్ ఫ్రెండ్ అనుపమను 1992లో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సత్య నాదెళ్ల తన కుటుంబంతో అమెరికాలో నివసిస్తున్నారు. అతనికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. మరోవైపు నాదెళ్లకు మొదటి నుంచి క్రికెట్‌పై చాలా ఆసక్తి ఉంది. క్రికెట్‌తో పాటు, సీటెల్‌లో ఉన్న ప్రొఫెషనల్ అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్ అయిన సీహాక్స్‌కు కూడా అతను పెద్ద అభిమాని. అతను తన ఫిట్‌నెస్ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అందుకే 53 ఏళ్ల వయసులో కూడా అతను చాలా యంగ్‌గా కనిపిస్తాడు.
ఒక సామాన్యుడి నుంచి  మైక్రోసాఫ్ట్ సీఈఓగా యూత్ మొత్తానికి ఆదర్శంగా నిలిచిన సత్య నాదెళ్లకు "ఇండియా హెరాల్డ్" తరపున పుట్టినరోజు శుభాకంక్షాలు. ఆయన మరెన్నో అద్భుతమైన పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆకాంక్ష.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: