హెరాల్డ్ బర్త్ డే : 18-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు.?

praveen

జూలై 18వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి.. 


 తాడూరి లక్ష్మీ నరసింహ రాయకవి  జననం : ఎంతో ప్రఖ్యాతి గాంచిన తెలుగు కవి అయిన  తాడూరి లక్ష్మీ నరసింహ రాయకవి  1856 జూలై 18 వ తేదీన జన్మించారు. ఈయన  అనేక రచనలు రచించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక ఈయన రచయిత జీవితం లో ఏకంగా 19 గ్రంధాలను రచించారు. ఈయన రచించిన రచనలు అన్నీ ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి రచించిన రచనలు పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉండేవి. 

 

 భవనం వెంకట్రామ్ జనన :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొమ్మిదో ముఖ్యమంత్రి అయిన భవనం వెంకట్రామ్ 1931 జూలై 18వ తేదీన జన్మించారు. ఈయన 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో పని చేశారు. ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో గొప్ప రాజకీయ నాయకులుగా  ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లు... భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆయన మంత్రివర్గంలో కలిసి మంత్రులుగా పనిచేశారు. కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండే వెంకట్రామ్ రెడ్డి తన పేరు చివరన ఉన్న రెడ్డిని విడిచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క అండదండలతో ముఖ్యమంత్రి అయిన వెంకట్రామ్ .. ప్రమాణ స్వీకారోత్సవానికి తన పాత రూం మేట్ అయిన ఎన్టీరామారావు ఆహ్వానించారు. ఈయన  ప్రమాణస్వీకారోత్సవం లోనే రామారావుకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనకు బీజం పడింది అని చెబుతూ ఉంటారు. 

 

 రమ్యశ్రీ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన రమ్య శ్రీ 1970 జూలై 18 వ తేదీన జన్మించారు. ఈమె  అసలు పేరు సుజాత. సినీ పరిశ్రమలో నట జీవితం ప్రారంభించిన తర్వాత రమ్యశ్రీ పేరుతో ప్రస్థానం ప్రారంభించారు. విశాఖపట్టణానికి చెందిన రమ్య శ్రీ  కన్నడ తమిళ మలయాళ హిందీ బోజ్పురి భాషల లో 250 చిత్రాలకు పైగా నటించారు. కన్నడలో ప్రతినాయక పాత్రలో 36 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. ఈమెకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్యభట్ట అనే పురస్కారం కూడా లభించింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తూ ఉంటుంది రమ్య శ్రీ. వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. 


 సౌందర్య జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన సౌందర్య 1972 జూలై 18వ తేదీన జన్మించారు. సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళం కన్నడం మలయాళం భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించారు. దాదాపు పన్నెండు సంవత్సరాలుగా అగ్ర తారగా వెలిగిన సౌందర్య... సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1992 లో గంధర్వ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు సౌందర్య. ఇక సౌందర్య తన నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించారు సౌందర్య. 

 


 ప్రియాంక చోప్రా జననం  : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన ప్రియాంక చోప్రా 1982 జూలై 18వ తేదీన జన్మించారు. మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక చోప్రా తన నటనా జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్ గా  2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. 2002 సంవత్సరంలో తమిళ సినిమా ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించిన ప్రియాంక చోప్రా... ఆ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వెళ్లి ఎన్నో  సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే  తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించింది ప్రియాంక చోప్రా. మరోవైపు తెలుగు తమిళ భాషల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది . ఏకంగా తన నటనతో ఫిలింఫేర్ ఉత్తమ కథానాయిక అవార్డులను కూడా అందుకుంది ప్రియాంక చోప్రా. ఇక ఆ తర్వాత కేవలం భారతీయ సినిమాల్లోనే కాదు హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్  జోనస్  ను పెళ్లి చేసుకుంది. 

 

 భూమి పెడ్నేకర్ జననం : భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన భూమి పెడ్నేకర్ 1989 జూలై 18వ తేదీన జన్మించారూ. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న భూమి పెడ్నేకర్ ఎంతగానో గుర్తింపు సంపాదించింది.  ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన భూమి పెడ్నేకర్... తన నటనతో అందచందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: