హెరాల్డ్ జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు..  ప్రవచన చక్రవర్తి... బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర్‌రావు

Spyder

మంచి చెడుల మ‌ధ్య బేధం తెలుపుతూ..స‌మాజాన్ని స‌న్మార్గంలో న‌డిపించేదే ప్ర‌వ‌చ‌నం. విష‌యం ఎంత మంచిదైన కావ‌చ్చు..అది అర్థం కాకుంటే అది నిష్ప్ర‌యోజ‌న‌మే..అర్థ‌మయ్యేట్లు విడ‌మ‌రిచి చెబితేనే మ‌హ్హ‌త‌ర్య‌మ‌ని తెలుస్తుంది. దుర‌దృష్ణ‌వ శాత్తు ఆధునిక స‌మాజ పొక‌డ ఎక్కువై మ‌న పురాణ‌, ఇతిహాసాలు, వేదాలపై అవ‌హేళ‌న‌లే ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. మ‌న పూర్వీకులు మ‌న‌కందించిన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, పూజాఫ‌లం వెనుక ఉన్న ఉద్దేశాల‌ను విడ‌మ‌రిచి చెప్పే పాండిత్యం, అపార విజ్ఞానం క‌లిగి ఉన్న‌వారు బ‌హుశా చాలా అరుదుగా ఉన్నార‌నే చెప్పాలి. అలా అరుదైన వారిలో ఆధ్యాత్మిక విష‌య బాండాగారం బ్ర‌హ్మ శ్రీ చాగంటి కోటేశ్వ‌ర్‌రావు ప్ర‌ప్ర‌థ‌ములు అనే చెప్పాలి. ఆయ‌న ప్ర‌వ‌చ‌నం కోసం కోట్లాది మంది తెలుగు ప్ర‌జ‌లు నిత్యం టీవీల్లో వీక్షించేందుకు ఇష్ట‌ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. 

 

చాగంటి కోటేశ్వరరావు  తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఆయ‌న చాగంటి సుందర శివరావు, సుశీలమ్మ దంప‌తుల‌కు 959 జూలై 14వ తేదిన జన్మించారు. కోటేశ్వ‌ర్‌రావు ధారణ శక్తి, జ్ఞాపకశక్తి అసామాన్యం. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు. మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు.

 


 కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. అతను ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు. జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బహుకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: