హెరాల్డ్ బర్త్ డే : 16-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?
జూలై 16 వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
అరుణ అసఫ్ అలీ జననం : ప్రముఖ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు... 1948లో మహాత్మాగాంధీ జైలుకెళ్లిన సమయంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుండి నాయకత్వం వహించి నడిపించిన గొప్ప మహిళ మూర్తి.. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయి లోని ఓ మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారతీయుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహిళా మూర్తి అరుణ అసఫ్ అలీ 1909 జూలై 16 వ తేదీన జన్మించారు. ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్ గా కూడా పనిచేశారు. వివాహం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలక సభ్యులు గా ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన బహిరంగ ప్రదేశాల్లో పాల్గొన్నారు అరుణ. స్వతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఆమె ఎన్నో రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు.
కేవీ కృష్ణ రావు జననం : భారత సైనిక దళాల మాజీ చీప్ జమ్మూకాశ్మీర్ నాగాలాండ్ మణిపూర్ త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన కె వి కృష్ణారావు 1923 జూలై 16 వ తేదీన జన్మించారు. నాలుగు దశాబ్దాల పాటు ఆర్మీకి సేవలందించిన కె వి కృష్ణారావు స్వాతంత్య్రానికి ముందే 1942 ఆగస్టు 9న సైన్యంలో చేరారు, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బర్మా బెలూచిస్థాన్ లో పనిచేశారు కె వి కృష్ణారావు, 1983లో ఆర్మీ ఛీప్ గా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ నాగాలాండ్ మణిపూర్ త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.
భువనేశ్వరి జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన భువనేశ్వరి 1975 జూలై 16వ తేదీన జన్మించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా టీవీ ధారావాహిక లో కూడా నటించారు భువనేశ్వరి. కన్నడ తమిళ మలయాళ భాషల్లో ఏకంగా 50 చిత్రాల్లో నటించారు. ఎక్కువగా సినిమాలలో శృంగార రస పాత్రలను పోషిస్తూ ఉంటారు భువనేశ్వరి,.
గోపీచంద్ లగడపాటి జననం : సినీ నటుడు నిర్మాత దర్శకుడు రచయిత అయిన గోపీచంద్ లగడపాటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనంద్ సినిమాతో రంగప్రవేశం చేశారు. ఈయన 1981 జూలై 16 వ తేదీన జన్మించారు. ఆ తర్వాత మిస్టర్ మేధావి అనే సినిమాను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించారు. గోపీచంద్ లగడపాటి మొట్టమొదటిగా ప్రియనేస్తం అనే తెలుగు ధారావాహికలో నటించి తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత ఆనంద్ సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు, ఆనంద్ సినిమా తదుపరి... రెండేళ్ల తర్వాత అనే సినిమాలో నటించారు. ఇలా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు గోపీచంద్ లగడపాటి,
కత్రినా కైఫ్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన కత్రినా కైఫ్ 1983 జూలై 16 వ తేదీన జన్మించారు. మోడల్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కత్రినాకైఫ్ ఆ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాలను దక్కించుకున్నారు . ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తన నటనతో అంద చందాలతో ఎంతోమంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు కత్రినాకైఫ్.