హెరాల్డ్ బర్త్ డే : 13-07-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూలై 13 వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి.మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 గుత్తి రామ కృష్ణ జననం  : కథకుడు పాత్రికేయులు స్వాతంత్ర సమర యోధుడు అయిన గుత్తి  రామకృష్ణ 1915 జూన్ 13వ తేదీన జన్మించారు, ఆయన కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు అని చెబుతూ ఉంటారు, చిన్నప్పుడు నుంచి ఆంగ్లేయులపై  ఎంతగానో ద్వేషం  పెంచుకున్న  రామకృష్ణ.. పాఠశాల  నుంచే ఇంగ్లీష్ పై ఆసక్తి  చూపించేవారు కాదు.  కల్లూరు సుబ్బారావు పువ్వు రామాచార్యులు మొదలైనవారి నాయకత్వంలో పనిచేశారు గుత్తా రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కమ్యూనిస్టు భావాల వైపు ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఒక పాత్రికేయుడిగా ఎన్నో రచనలను కూడా రచించారు గుత్తి రామకృష్ణ, 


 హీరాలాల్ మోరియా జననం : పత్రికా రచయిత నవలా రచయిత సమరయోధుడు అయినా హీరాలాల్ మోరియా 1924 జూలై 13 వ తేదీన జన్మించారు. నిజం  ప్రభుత్వ వ్యతిరేక పోరాటం రోజుల్లో ముఖ్యంగా రజాకార్ల దురంతాలను శక్తివంతంగా ప్రతిఘటించిన స్టేట్ కాంగ్రెస్ ఆరంభంలోనే మొదటిసారిగా సత్యాగ్రహం చేసి జైలు పాలయ్యాడు ఈయన. ఇక అప్పట్లో ఈయన ఇచ్చే  ఉపన్యాసాలు ఎంతగానో ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపాయి. నైజాం నవాబు నిరంకుశ పాలన గురించి ఎంతగానో చైతన్యం కలిగించే వారు ఈయన. 

 

 కల్పనా దేవి జననం : ప్రముఖ రాజకీయ నాయకురాలు లోకసభ సభ్యురాలు అయిన కల్పన దేవి  1941 జూలై 13 వ తేదీన జన్మించారు. 8 వ లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి 1984లో 8 వ లోక్ సభకు ఎన్నికై పార్లమెంటు లో ఆమె గళం వినిపించారు.


 ఉత్పల్ చటర్జీ జననం  : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయిన ఉత్పల్ ఛటర్జీ  1964 జూలై 13 వ తేదీన జన్మించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్... బ్యాట్ మెన్  అయిన ఉత్పల్ ఛటర్జీ  భారతీయ క్రికెట్ జట్టులో ఎంతగానో కీలకమైన ఆటగాడిగా రాణించారు. అంతేకాకుండా క్రికెట్లో ఎన్నో రికార్డులను సైతం సృష్టించారు. క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2008లో బెంగాల్ క్రికెట్ టీం కి కోచ్ గా కూడా పని చేసారు ఉత్పల్ ఛటర్జీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: