హెరాల్డ్ బర్త్ డే : 08-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 8వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగిన విషయం తెలిసిందే. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 డి.రామలింగం జననం  : ప్రముఖ రచయిత అయిన డి.రామలింగం 1964 జూన్ 8వ తేదీన జన్మించారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్ట భద్రుడు అయ్యారు . 1946- 48 మధ్య హైదరాబాద్ స్వాతంత్ర సమరంలో కూడా స్టేట్ కాంగ్రెస్ తరఫున ఉద్యమంలో పాల్గొన్నారు డి.రామలింగం. ఇక ఈయన రచించిన ఎన్నో రచనలు ప్రేక్షకాదరణ పొందాయి. పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలు రచించడం తోపాటు ఎన్నో ప్రముఖ రచనలు రచించి  ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1993 జనవరి 3వ తేదీన ఆయన మరణించారు. 

 


 గిరిబాబు జననం : తెలుగు చిత్ర పరిశ్రమలో గిరిబాబు గా పేరొందిన ఎర్రశేష గిరి  రావు ప్రముఖ తెలుగు సినిమా నటుడు దర్శకుడు నిర్మాత. తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. సుమారు మూడు దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నాడు. ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులని  సంపాదించుకున్నారు. అంతేకాకుండా హాస్యనటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో కూడా నటించారు గిరిబాబు. ఇక గిరిబాబు వారసుడిగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రఘుబాబు కొనసాగుతున్నారు. చిన్నతనం నుంచే నాటకరంగం పట్ల అంతగా ఆసక్తి ఉన్న గిరిబాబు... సినిమా రంగం వైపు అడుగులు వేశాడు. 1973 లో విడుదలైన జగమే మాయ సినిమా ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు గిరిబాబు. 1977 లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా కూడా అవతారమెత్తాడు. నేటికి కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు గిరిబాబు. అతని వారసుడు  రఘుబాబు కూడా హాస్య నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు

 


 డింపుల్ కపాడియా జననం : ప్రముఖ భారతీయ నటి అయిన డింపుల్ కపాడియా 1957 జూన్ 8వ తేదీన జన్మించారు. ఈమె  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. 14వ ఏట నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈమె తర్వాత ఎంతో  గుర్తింపు సంపాదించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికి కూడా బాలీవుడ్ ప్రేక్షకులను తన సినిమాల ద్వారా అలరిస్తూనే ఉన్నారు  డింపుల్ కపాడియా. డింపుల్ కపాడియా కు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక డింపుల్ కపాడియా ఉత్తమ నటిగా ఎన్నో జాతీయ అవార్డులను  అందుకోవడం తో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. 

 

 లక్ష్మణ్ ఏలే జననం : సుప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు అయినా లక్ష్మణ్ ఏలే 1965 జూన్ 8వ తేదీన జన్మించారు. మనీ మనీ అనగనగా ఒకరోజు, సత్య, రంగీలా, దయ్యం లాంటి దర్శకుడు వర్మ సినిమాలకు లక్ష్మణ్ ఏలే పబ్లిసిటీ డిజైనర్ గా కూడా పనిచేశారు. ఇక చిత్రకారుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు లక్ష్మణ్ ఏలే. సినీ నటుడు ఉత్తేజ్ ఈయనకు బంధువు. ఉత్తెజ్  ద్వారా రామ్ గోపాల్ వర్మ ఈయనకు పరిచయమయ్యాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎన్నో సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసి ఎంతగానో గుర్తింపు సంపాదించారు లక్ష్మణ్ ఏలే. 


 శిల్పా శెట్టి జననం  : ప్రముఖ భారతీయ నటి అయిన శిల్పా శెట్టి
 1975 జూన్ 8వ తేదీన జన్మించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాజిగర్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తన అందాలతో ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకుంది. తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది శిల్ప శెట్టి. తన నటనకు గాను ఉత్తమ నటిగా ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: