“ పెసరపప్పు” తో...“చుండ్రు” ని పోగొట్టే అద్భుతమైన “చిట్కా”

Bhavannarayana Nch

చుండ్రు ఇది ఎంతో మంది యువతీ యువకులని చిన్నా పెద్దా తేడా లేకుండా వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఈ చుండ్రు సమస్య ఉందంటే అది జుట్టు సంరక్షణపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది..ఈ చుండ్రు వచ్చిన సమయంలో సరైన జాగ్రత్తలు గనుకా తీసుకోకపోతే మాత్రం మీ జుట్టు పొడిబారిపోయి..కుదుళ్ళు జుట్టు సంనబడిపోయి చివరికి జుట్టు ఊడిపోతుంది..ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు కానీ ఈ సమస్యని మనం కంట్రో చేసుకునే అవకాశం ఉంది.

 

అయితే ప్రకృతి లో సహజసిద్ధంగా లభించే పదార్ధాల వలన జుట్టు పాడవకుండా ఉంటుంది.. మన పూర్వీకులు ఎప్పటి నుంచో  సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా అనాదిగా జుట్టును సంరక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవారు అయితే అటువంటి పద్దతులలో ముఖ్యమైనదిగా ఉన్న పద్దతి పెసరపప్పు తో చుండ్రు నివారణ..సాధారణంగా పెసరపప్పులో ఖనిజాలు, ప్రోటీన్లు మరియు పీచుపదార్ధం మెండుగా ఉంటాయి. ఈ సుగుణాలు ఉన్నందున, పెసరపప్పు చుండ్రు మొదలైన ఎన్నోరకాల కేశ సమస్యల నుండి పరిష్కారం అవుతుంది.

 

అయితే ఈ పెసరపప్పు వలన మాడు చల్లబడి, దురద, మంట తగ్గి, తేమ అంది, పొట్టు రాలడం ఆగుతుంది. ఇది సహజమైన మెరుపును అందించడమే కాక, కుదుళ్ల నుండి మీ జుట్టును బలంగా మారుస్తుంది. పెసరపప్పును ఏ విధంగా వాడటం వలన చుండ్రు నివారింపబడుతుందో తెలుసుకునే ముందు చేయాల్సిన పద్దతులు ముందుగా  

 

4 టేబుల్ స్పూన్ల పెసరపప్పు  పెద్ద గిన్నెతో నీరు తీసుకుని పెసరపప్పు నీటిలో నానబెట్టాలి...ఆ తరువాత నానబెట్టిన పప్పును మెత్తని ముద్దగా ఆ తరువాత జుట్టును గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి...అయితే ముందుగానే తయారు చేసుకున్న పెసరముద్దతో మాడును రుద్దుకుంటూ పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.  ఇప్పుడు మరలా జుట్టును గోరువెచ్చని నీళ్లతో తిరిగి మొత్తం శుభ్రపడే విధంగా రుద్దుకోవాలి.అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే దీనిలో షాంపూ వాడుకోరాదు.

 

ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే తప్పకుండా చుండ్రు పూర్తిగా తొలిగిపోయి జుట్టుకూడా బలంగా తయారవుతుంది... ఇలా చేయడం వలన మాడుకు తేమ అంది మాడు పొలుసులుగా మారదు. ఈ ప్రకృతి సహజ పద్ధతిని పాటిస్తే, దీనిలో ప్రోటీన్లు మరియు పీచుపదార్ధం మాడును శుభ్రంగా ఉంచి మృతకణాలను పేరుకుపోకుండా చేస్తుంది. పెసరపప్పు లో ఉండే విటమిన్ బి జుట్టుని ధృడంగా ఉండేలా చేస్తుంది...అంతేకాదు పెసరపప్పు లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి...ఇవి  జుట్టుకు లోతైన పోషణను ఇచ్చి, సూర్య కిరణాల మరియు వాతావరణ కాలుష్యం నుంచీ కూడా జుట్టుని కాపాడుతాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: