జిడ్డు, మొటిమలు, మచ్చలు, రంధ్రాలు ఈజీగా తగ్గాలంటే..?

Purushottham Vinay
  జిడ్డు, మొటిమలు, మచ్చలు, రంధ్రాలు ఈజీగా తగ్గాలంటే..?  

నేటి కాలంలో చాలామంది యువతీ, యువకులకు ముఖం పై మొటిమలు, మచ్చలు, రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు చాలా మంది యువతలో కామన్ అయిపోయింది. కొంతమంది అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యని ఎదురుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యలని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా బ్యూటీ పార్లర్ లకి లేదా సెలూన్ షాప్స్ కి వెళ్లి లేదా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటి వల్ల అవి తగ్గకపోగా ఇంకా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ముఖం పై రంధ్రాలు, మొటిమల్ని గిల్లడం వలన ఒత్తిడి ఇంకా డీహైడ్రేషన్ వలన, పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని ఇంకా అలాగే మొటిమల్ని, మచ్చలని ఈజీగా తగ్గించుకునేందుకు మన ఇంట్లో దొరికే కొన్ని నాచురల్ పదార్థాల్ని ని వాడితే ముఖం అందంగా, సున్నితంగా తయారు అవుతుంది.ఓట్ మిల్క్ ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగించడంలో సహాయపడుతుంది. ఇంకా అలాగే పెరుగులో కూడా లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మొటిమలు, మచ్చలు ఇంకా రంధ్రాలను తగ్గించి బిగుతుగా చేసి చర్మాన్ని మృదువుగా ఇంకా కాంతివంతంగా చేస్తుంది.


ఇక ఈ ఫేస్ ప్యాక్ కోసం రెండు స్పూన్ ల ఓట్స్‌లో ఒక చెంచా పెరుగును కలిపి పేస్ట్ లాగా చేసి ఫేస్ పై ఈ పేస్ట్ ని  అప్లై చేసి 10- 15 నిముషాలు ఉంచి సాధారణ లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం పై రంధ్రాలు, మొటిమలు, మచ్చలు ఇంకా జిడ్డుచర్మం తొలగిపోతుంది.అలాగే తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖ రంధ్రాలు తొలగించడంలో ఎంతగానో సహాపడతాయి. ఇంకా అలాగే నిమ్మకాయలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది జిడ్డు చర్మాన్ని తగ్గిస్తుంది. ఇక పంచదార ముఖంపై ఉన్న మురుకిని తొలగిస్తుంది.ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్లు చక్కెర, కొంచె తేనె ఇంకా రెండు చెంచాల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఆ తర్వాత కొంచెం సేపటి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి లేదా రెండు సార్లు చేస్తే ముఖం పై మొటిమలు, మచ్చలు ఇంకా రంధ్రాలు ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: