జుట్టు తెల్లగా ఉందని బాధపడుతున్నారా? నల్లగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చెయ్యాల్సిందే?

Purushottham Vinay
జుట్టు తెల్లగా ఉందని బాధపడుతున్నారా? నల్లగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చెయ్యాల్సిందే? 
 

ప్రస్తుతం తెల్ల జుట్టుల సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారుతోంది. ఈ సమస్యతో చిన్నా పెద్దా తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు.జుట్టు రంగు మారడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఇంకా సరి అయిన పోస్తికాహరం లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికమవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.శీకాయ వల్ల ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. తలలో దురద ఇంకా దద్దుల్లు లాంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. చిన్న వయస్సులో తెల్ల జుట్టు సమస్యను ఇది తగ్గిస్తుంది. జుట్టు నలుపు దనాన్ని శీకాయ తిరిగి తీసుకువస్తుంది. వెంట్రుకలు రాలిపోయే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కాంతివంతమైన, మృదువుగా ఉండే జుట్టును అందిస్తుంది.

బాదం నూనె, పెరుగు తెల్ల జుట్టు సమస్యని ఈజీగా తగ్గిస్తాయి. తెల్ల జుట్టు సమస్యను బాదం నూనె ఈజీగా నివారిస్తుంది. ఎందుకంటే బాదం నూనె వాడటం వల్ల తలలో చుండ్రు తగ్గిపోవడంతో పాటు కురులు కూడా చాలా దృఢంగా  ఉంటాయి. ఇక మూడవ పదార్థం పెరుగు తరతరాలుగా జుట్టు పోషణకు పెరుగును ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. పెరుగు తెల్ల జుట్టు సమస్యకు చాలా రకాలుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు పెరుగు అనేది మంచి హెల్తీ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కేశాలు తిరిగివచ్చేలా పైన తెలిపిన పదార్ధాలు ఎంతగానో సహాయపడతాయి. శీకాయ, పెరుగు, బాదం ఆయిల్ ఈ మూడింటిని ఉపయోగించి తెల్ల జుట్టును ఇంట్లోనే చాలా ఈజీగా నల్లగా మార్చు కోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ ఇంట్లో ట్రై చెయ్యండి. తెల్లగా మారుతున్న మీ జుట్టుని చాలా ఈజీగా నల్లగా మార్చుకోండి. మృదువైన నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: