బట్టతలకి కారణాలు? తీసుకోవాలిసిన జాగ్రత్తలు?

Purushottham Vinay
బట్టతలకి కారణాలు ? తీసుకోవాలిసిన జాగ్రత్తలు ?


నేటి కాలంలో చాలా  చిన్నవయసులోనే బట్టతల వచ్చేసి నలుగురిలో బయటికి రాలేకపోతున్నారు. ఇంకొంతమందికి అయితే ఈ సమస్య వల్ల పెళ్లిళ్లు కూడా అవ్వడం లేదు. అయితే జుట్టు రాలిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటి గురించి  తెలుసుకొని సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.జుట్టు రాలే సమస్య కొన్ని రకాల వైద్య పరిస్థితుల కారణంగా వస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాల వల్ల ఇది జరుగుతుంది.అధిక ఒత్తిడి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటం వల్ల జుట్టు ఊడిపోతుంది. ఇది మానసిక, ఇంకా శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒత్తిడి జుట్టు పెరుగుదల చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది జుట్టు రాలడానికి ఇంకా పలుచబడటానికి దారితీస్తుంది.శరీరం, జుట్టు సరైన పెరుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యం. పోషకాహారం లోపం వల్ల జుట్టుపై చెడు ప్రభావం పడుతుంది. 


ముఖ్యంగా ఆహారంలో బయోటిన్, ఐరన్, విటమిన్ డి, ప్రొటీన్ వంటి పోషకాలు ఉండాలి. లేదంటే వెంట్రుకలు పల్చబడటం, చిట్లడం మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ జుట్టు సహజంగా పలుచబడుతుంది. ఈ పరిస్థితిలో పోషకాహారం తీసుకోవడం చక్కటి మార్గం.కొందరు వ్యక్తులు సన్నని జుట్టును వారసత్వంగా పొందుతారు. వీరి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జుట్టు నాణ్యత సరిగ్గా లేకుంటే వారి జుట్టు కూడా పలుచగా మారే అవకాశం ఉంది.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం జుట్టు పెరుగుదల, నాణ్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పోషకాహారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో గుడ్లు ఇంకా నట్స్ వంటి బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఇంకా అంతే కాకుండా ఆకుకూరలు, చేపలు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్, బీన్స్ వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్ జుట్టుకు మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: