సిల్కీగా ఉండే మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే ఒక సింపుల్ హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకుందాం. ఇక ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, మీకు కేవలం 3 వస్తువులు మాత్రమే ఉపయోగించాలి. ఈ మూడు వస్తువులకు మీకు కేవలం రూ. 14 మాత్రమే ఖర్చు అవుతుంది. మీరు కేవలం రూ. 14లో వేల రూపాయల ఖరీదు చేసే కెరాటిన్ చికిత్స వంటి రూపాన్ని కూడా పొందవచ్చు. ఇక ఆ హెయిర్ మాస్క్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, మీకు 2 గుడ్లు, 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్, 2 కలబంద ఆకులు అవసరం. ఈ మూడు వస్తువులతో మాస్క్‌ను తయారు చేయడానికి మీరు ముందుగా కలబంద ఆకుల నుండి తొక్కను వేరు చేయండి. ఇప్పుడు అందులో ఉండే జెల్‌ని తీసి దాన్ని బాగా మెత్తగా చేయాలి. ఆ తరువాత, రెండు గుడ్లను పగలగొట్టి జెల్లో ఉంచండి. ఒక చెంచా తీసుకొని దాని సహాయంతో రెండింటినీ బాగా కలపండి. చివరగా దానిలో విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి మిక్స్ చెయ్యండి. ఇలా చేస్తే కేవలం 5 నిమిషాల్లో మీ హెయిర్ మాస్క్ ఈజీగా రెడీ అవుతుంది. చేతులు లేదా బ్రష్ సహాయంతో మూలాల నుండి క్రిందికి దాన్ని అప్లై చెయ్యండి. అది అప్లై చేసి సుమారు ఒక అరగంట పాటు వదిలివేయండి.
ఇక కొంచెం సమయం తరువాత, మీ జుట్టుకు అప్లై చేసిన ఆ మాస్క్ ఎండిపోయి గట్టిగా మారిపోతుంది. ఆ తర్వాత ముందుగా సాధారణ చల్లటి నీటితో కడిగి, ఇక ఆ తర్వాత షాంపూ సహాయంతో మరోసారి జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి. వెంట్రుకలను శుభ్రంగా కడిగిన తర్వాత, కాటన్ క్లాత్ సహాయంతో జుట్టును బాగా ఆరబెట్టండి.ఇక ఆ తర్వాత ఏదైనా హెయిర్ సీరమ్ తీసుకొని కొద్దిగా తడి జుట్టు మీద అప్లై చేయండి. ఈ పద్ధతిని పాటించిన వెంటనే, మీ జుట్టుపై అద్భుతమైన ప్రభావాన్ని మీరు స్పష్టంగా చూస్తారు. గుడ్డు పచ్చసొన పొడి జుట్టుకు మంచి పోషణనిస్తుంది. జుట్టు మెరిసేలా చేస్తుంది. ఇంకా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.అలాగే అలోవెరా జెల్లో ఉండే విటమిన్లు, అమైనో యాసిడ్లు, మినరల్స్ పొడి ఇంకా నిర్జీవమైన జుట్టును తేమగా చేస్తాయి. జుట్టును బాగా మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.అలాగే విటమిన్ ఇ జుట్టును బలోపేతం చేయడమే కాకుండా దానిని మందంగా ఇంకా మృదువుగా చేస్తుంది. దీనితో పాటు, ఇది చుండ్రును ఈజీగా తొలగిస్తుంది. జుట్టును చాలా ఆరోగ్యంగా చేస్తుంది. ఈ విధంగా, ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు పొందడానికి ఈ టిప్ పాటించండి.