పొట్ట దగ్గర కొవ్వు ఈజీగా కరిగే టిప్?

Purushottham Vinay
ఇక పొట్ట దగ్గర ఎక్కువ ఎక్కువగా ఉన్న వారు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే కూరగాయలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, ఫైబర్, మినరల్స్, క్యాల్షియం ఇంకా ఐరన్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో ఈజీగా సహాయపడుతుంది.అలాగే కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీర బరువు కూడా సులభంగా తగ్గుతుంది. ఇంకా అలాగే పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పండ్లల్లో ఫైబర్ తో పాటు ఇతర పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల మనం ఇతర చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా ఉంటాము. పండ్లను తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు 12 శాతం తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



ఇంకా అలాగే పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్న వారు మద్యాన్ని తీసుకోవడం తగ్గించాలి. ఈ ఆల్కాహాల్ ను తీసుకోవడం వల్ల శరీరంలోకి అదనంగా ఎన్నో క్యాలరీల శక్తి వచ్చి చేరుతుంది. అదనంగా ఉన్న క్యాలరీలు పొట్ట దగ్గర కొవ్వుగా అది పేరుకుపోతూ ఉంటాయి.కాబట్టి మద్యాన్ని తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించడంలో వల్ల శరీర బరువు తగ్గడంతో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇక పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్న వారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి.ఎందుకంటే ప్రోటీన్ కూడా మన శరీరానికి ఎంతో అవసరం. ఇక ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిని భావన కలుగుతుంది. దీంతో మనం చాలా సులభంగా బరువు తగ్గడంతో పాటు పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా ఉంటుందని శరీర బరువు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: