ఈ ఒక్కటి చాలు.. అన్ని ఫేస్ ప్రాబ్లంస్ మాయం?

Purushottham Vinay
మనం రోజు తినే టమాటాతో చర్మాన్ని కూడా మెరిపించుకోవచ్చు. టమాటా గుజ్జు, రసం ఇంకా పేస్ట్ వంటి వాటితో ఫేస్ ప్యాక్ లు రెడీ చేసుకుని వాడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.రోజు కాస్త సమయం తీసుకుని వాడితే స్కిన్ టోన్ కూడా బాగా మెరుగు పడుతుంది. ముఖ్యంగా చర్మంపై పేరుకున్న ట్యాన్ ను తీసి వేయడంలో టమాటా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంత మందికి కాస్త ఎండ తగిలినా కూడా ముఖం చాలా నల్లగా మారుతుంది. అలాంటి వారికి స్కిన్ దెబ్బతినకుండా ఉంచడంలో టమాటా బాగా ఉపకరిస్తుంది.ఇక టమాటాను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మనం ఎండా కాలంలో కొన్ని పనుల నిమిత్తం ఎండలో బయటకు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వడ దెబ్బ తినేస్తాం. ముఖం కూడా కమిలిపోయి చాలా నల్లగా మారుతుంది.ఇంకా ట్యాన్ పేరుకుంటుంది. ఇలాంటి వారు ఎండలో నుంచి రాగానే కాళ్లు, చేతులు ఇంకా ముఖం కడుక్కుని.. టమాటా గుజ్జును ముఖానికి, ఎండ తగిలిన భాగాలకు పట్టిస్తే ట్యాన్ పోవడమే కాకుండా.. మంచి రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది.


అలాగే కొంత మందికి జిడ్డు చర్మం కూడా ఉంటుంది. దీంతో వారు ఎక్కడికి వెళ్లాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎంత బాగా శుభ్రం చేసుకున్నా కూడా జిడ్డు కారుతూ ఉంటుంది. ఇలాంటి వారు ఏది వాడాలన్నా కూడా చాలా భయమే. ఇలాంటి జిడ్డు చర్మం గల వారికి టమాటా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే టమాటాకు జిడ్డును నియంత్రించే గుణాలు ఉన్నాయి. అందుకే టమాటను కట్ చేసి ఒక ముక్కను తీసుకుని ముఖంపై మెల్లగా రుద్దుకోవాలి. అది బాగా ఆరిపోయాక నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే జిడ్డు చర్మానికి చెక్ పెట్టొచ్చు.మనం ముఖం ఎంత శుభ్రం చేసుకున్నా కూడా ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి అసలు అంత ఈజీగా పోవు. అందువల్ల చాలా మంది బ్యూటీ పార్లర్లకు వెళ్తూంటారు. అయితే అలా కాకుండా ఇంట్లోనే టమాటా ఫేస్ ప్యాక్ లను ట్రై చేస్తే మృత కణాలు పోతాయి. ఇంకా అంతే కాకుండా స్కిన్ టోన్ కూడా మెరుగు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: