ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగయ్యి ఒత్తుగా పెరుగుతుంది?

Purushottham Vinay
జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, జుట్టు చిట్లడం, చుండ్రు ఇంకా నల్ల బడటం వంటి సమస్యలతో బాధపడే వారు నేటి కాలంలో చాలా ఎక్కువవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని నుండి బయట పడి జుట్టు పొడవుగా, నల్లగా ఇంకా ఒత్తుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.చాలా రకాల నూనెలను, షాంపులను వాడుతూ ఉంటారు.అయినా కూడా ఎటువంటి ఫలితం లేకపోవడం చేత తీవ్ర నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు మన ఇంట్లోనే సహజ సిద్దంగా లభించే పదార్థాలతో పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల చాలా ఈజీగా జుట్టు సమస్యలన్నింటి నుండి బయట పడవచ్చు. ఈ టిప్ ని వారానికి ఒకసారి వాడితే చాలు జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టును ఒత్తుగా పెంచే ఆ చిట్కా ఏమిటి.. ఇంకా దీనిని ఎలా తయారు చేసుకోవాలి..అలాగే ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.



ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల బృంగరాజ్ పౌడర్ ( గుంటగలగరాకు పొడి)ని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో రెండు టీ స్పూనన్ల ఉసిరికాయ పొడిని వేసి కలపాలి. ఆ తరువాత రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనె ఇంకా నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచిన తరువాత కుంకుడుకాయలతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ పేస్ట్ తయారీలో వాడిన ప్రతి పదార్థం కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా మార్చడంలో బాగా సహాయపడతాయి. ఇలా పేస్ట్ ను తయారు చేసుకుని వారానికి ఒకసారి వాడడం వల్ల జుట్టు నల్లగా, పొడవుగా  ఇంకా అలాగే కాంతివంతంగా మారుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని ట్రై చేయండి. జుట్టు సమస్యలని ఈజీగా తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: