ఈ ఆయిల్ వాడితే మీ జుట్టు ఒత్తుగా ఉంటుంది?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పబోయే హెల్తీ ఆయిల్ ను మీరు వారంలో కేవలం రెండు సార్లు కనుక వాడితే ఖచ్చితంగా పలుచగా ఉన్న మీ జుట్టు కొద్ది రోజుల్లోనే బాగా ఒత్తుగా మారుతుంది.ఇక ఇప్పుడు ఆ ఆయిల్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక ఉల్లిపాయను తీసుకుని దాని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, గుప్పెడు మెంతాకు ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు ఇంకా రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి నూనెని మీరు అందులో వేసుకోవాలి.ఆ ఆయిల్ కాస్త వేడి అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అలా ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.తరువాత మీరు ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా బాగా మసాజ్ చేసుకోవాలి .తరువాత మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇక పల్చటి జుట్టుతో బాధపడుతున్న పురుషులు అయితే ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ను కేవలం వారంలో రెండు సార్లు కనుక వాడితే కొద్ది రోజుల్లోనే జుట్టు చాలా ఒత్తుగా మారుతుంది.అంతేగాక హెయిర్ ఫాల్ కూడా క్రమంగా కంట్రోల్ అవుతుంది. దీంతో బట్టతల సమస్యకి చాలా దూరంగా ఉండవచ్చు. పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు చాలా త్వరగా తెల్లబడకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. నల్లటి ఒత్తుగా వుండే జుట్టుని మీరు చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: