పెళ్లయిన 4 నెలలకే ప్రెగ్నెంటా.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన చిన్నారి పెళ్లికూతురు..!

Divya
గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సెలబ్రిటీలలో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ ఆవికా గోర్ కూడా ఒకరు , తను ప్రేమించిన వ్యక్తి మిలింద్ చంద్వానీని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకుంది. అలా వివాహమైన కొన్ని నెలలకే ఒక కొత్త జర్నీ మొదలవుతుందంటూ ఈ జంట ఒక వీడియోలో చెప్పడంతో అభిమానులు సైతం ఈ జంటకు కంగ్రాచులేషన్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా ఆవికా గోర్ గర్భవతి అని అందుకే ఆమె కెరియర్ కు బ్రేక్ ఇవ్వబోతోందనే విధంగా వార్తలు ఎక్కువగా వినిపించాయి.


తాజాగా ఈ వార్తలకు స్పందిస్తూ తాను  గర్భవతిని కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాంటి విశేషమేమీ లేదు కానీ త్వరలోనే ఒక శుభవార్త చెబుతాను అంటూ తెలిపింది. అది సినిమాలకు సంబంధించిందా? లేకపోతే వ్యక్తిగత విషయమా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. తన బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని మొదటిసారిగా తన స్నేహితులతో కలిసి 2020లో హైదరాబాదులో కలుసుకున్నానని ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని అలా 2025 జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట అదే ఏడాది ఒక రియాలిటీ షోలో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.


ఇక అప్పటినుంచి ఈ జంట తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెన్సేషనల్ గా మారుతొంది. అయితే ఈమధ్య సినిమాల కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికా గోర్ ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజు గారి గది 2 తదితర చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: