పగిలిన కాలి మడమలు మృదువుగా అవ్వాలంటే..?
చలికాలంలో చాలామందికి కూడా వారి కాలి మడమలు పగులుతాయి. కొంతమందికి ఒట్టి చలికాలం అనే కాదు ఎప్పుడూ కూడా వారి మడమలు పగులుతాయి.వీటిని పట్టించుకోపోతే ఆ సమస్య ఖచ్చితంగా మరింత పెద్దదిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో పాదాల అందం ఇంకా ఆరోగ్యం కూడా పూర్తిగా చెడిపోతుంది.అయితే కొన్ని హోం రెమెడీస్ పాటించడం వల్ల ఈ పగుళ్లని ఈజీగా నయం చేయవచ్చు. వాస్తవానికి నీరు, దుమ్ము వల్ల మడమలు పగిలిపోయే అవకాశాలు బాగా పెరుగుతాయి. లోతుగా పగిలినప్పుడు మీకు ఖచ్చితంగా చాలా నొప్పిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పగుళ్లు వచ్చేలోపు ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవడం మంచిది. మనం మన ఇంట్లో కొబ్బరినూనెను ఎక్కువగా జుట్టుకు పట్టించడానికి ఉపయోగిస్తాం. కానీ మడమల పగుళ్లను నయం చేయడానికి కూడా ఈ నూనెని వాడుతారు.
చలికాలంలో ఇది మడమలను తేమగా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఈజీగా కాపాడుతుంది. ఇంకా అలాగే అరటిపండు కూడా చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. రెండు పండిన అరటిపండ్లను తీసుకొని వాటిని పేస్ట్‌లా చేసి పాదాల మడమల మీద ఒక 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై బాగా శుభ్రం చేసుకోవాలి.అప్పుడు మీ మడమలు దాదాపు 2 వారాల్లో ఈజీగా చక్కబడతాయి. ఇంకా అలాగే పగిలిన మడమలను బాగు చేయడానికి పాదాలను గోరువెచ్చని నీటిలో సుమారు ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మడమలను స్క్రబ్బర్‌తో బాగా రుద్దాలి. తరువాత దానిలో ఉన్న డెడ్ స్కిన్‌ను నెమ్మదిగా తొలగించాలి. నీళ్లలోంచి తీసి ఆవాల నూనె రాసుకుని సాక్స్ వేసుకుంటే కొన్ని రోజుల్లో సమస్య పూర్తిగా నయమవుతుంది.కాబట్టి ఖచ్చితంగా పగిలిన కాలి మడమలు మృదువుగా అవ్వాలంటే పైన పేర్కొన్న టిప్స్ పాటించండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి.