చర్మానికి ఎంతగానో మేలు చేసే ఫుడ్ ఇదే..?
చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం తినే ఫుడ్ పై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. మనం తినే ఆహారం వల్ల కూడా మన చర్మ ఆరోగ్యం బాగుంటుంది.పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి.వీటిని ఉపయోగించడం వల్ల మీ చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. ఈ చలికాలంలో ఖచ్చితంగా మన చర్మం ముడుచుకుపోతుంది. ఇంకా అలాగే ముడతలు వచ్చే సూచనలు కనిపించడం కూడా ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఆయిల్, సబ్బు, సీరం, హెయిర్ మాస్క్, క్రీమ్ ఇంకా మరెన్నో అప్లై చేయడం చేసి చర్మాన్ని రక్షణకి ప్రయత్నిస్తారు. అయితే మనం ఎన్ని క్రీమ్‌లు వాడినా కూడా ఫలితం ఉండదు. కానీ మనం తినే ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకుంటే చర్మం నుండి జుట్టు వరకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎముకలు కూడా చాలా దృఢంగా మారుతాయి.బటన్ మష్రూమ్‌లలో విటమిన్లు ఇంకా అలాగే పొటాషియం చాలా పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం.పుట్టగొడుగులు జుట్టును బలంగా ఇంకా ఊడిపోకుండా ఉంచేందుకు ఉపయోగపడతాయి.ఇది మనం తినే పిజ్జాలో కూడా కనిపిస్తుంది.
ఈ పుట్టగొడుగును ఏ మాత్రం తీసేయకూడదు. ఎందుకంటే ఇందులోని అధిక విటమిన్ ఇంకా మినరల్ కంటెంట్ మీ ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగులను తినడం వల్ల చర్మం బాగా మెరుస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.అయితే ప్రతి ఒక్కరూ కూడా పుట్టగొడుగులను తినడానికి ఇష్టపడరు. కానీ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పుట్టగొడుగులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆసియా నుండి నేరుగా వచ్చే ట్రెమెల్లా లేదా షిటేక్ వంటి అనేక పుట్టగొడుగు జాతులు చర్మానికి చాలా రాకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. పుట్టగొడుగులు పొడి, నిర్జలీకరణ చర్మం ఇంకా అలాగే వృద్ధాప్యం వంటి సమస్యలతో పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.