అందమైన ఐబ్రోస్ కోసం అదిరిపోయే టిప్స్?

frame అందమైన ఐబ్రోస్ కోసం అదిరిపోయే టిప్స్?

Purushottham Vinay
మన ముఖానికి కనుబొమ్మలు చక్కటి అందాన్ని ఇస్తాయి. మన ముఖం అందంగా ఆకర్షనీయంగా కనబడటానికి కనుబొమ్మలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.కాబట్టి కనుబొమ్మలను ఒత్తుగా ఇంకా అందంగా మార్చే టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి తెలుసుకొని ఖచ్చితంగా పాటించండి. మంచి ఫలితం ఉంటుంది.ఫస్ట్ మీరు ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి.ఇక ఆ తరువాత అందులో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి.  ఈ మిశ్రమంలో దూదిని ముంచి మీ కనుబొమ్మలపై రాసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని కేవలం రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలపై రాసుకుని ఉదయాన్నే కడిగి వేయాలి. ఇలా మీరు ఓ వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా ఇంకా నల్లగా పెరుగుతాయి. అలాగే కనుబొమ్మలను అందంగా మార్చే మరో  సింపుల్ టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ టిప్ కి మనం ఆముదం నూనెను, విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల ఆముదం నూనెను తీసుకోవాలి. ఆ తరువాత అందులో రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీరు దూదితో లేదా చేతి వేళ్లతో కనుబొమ్మలపై రాసి కొంచెంసేపు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా మీరు రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు రాసుకుని ఉదయాన్నే దానిని కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా  కనుబొమ్మలు చాలా అందంగా మారతాయి. ఈ టిప్ లను పాటించడం వల్ల చాలా సులభంగా ఇంకా తక్కువ సమయంలో మనం మన కనుబొమ్మలను ఒత్తుగా ఇంకా నల్లగా మార్చుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. మీ కనుబొమ్మలను అందంగా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: