చర్మ సమస్యలు తగ్గి అందంగా వుండాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చర్మ సమస్యలు తగ్గి అందంగా వుండాలంటే ఇలా చెయ్యండి...
ఒక గిన్నెలో ఒక చెంచా పసుపు పొడి మరియు ఒక కప్పు రోజ్ వాటర్ కలపండి. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయండి. గడ్డగా మారిన తర్వాత వాడుకోవచ్చు.అయితే, మీ ముఖం మీద పసుపు ఐస్ క్యూబ్స్ ఉపయోగించే ముందు మీ చేతి వెనుక భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. పసుపు ఐస్ క్యూబ్‌ను చేతి వెనుక భాగంలో సున్నితంగా మసాజ్ చేయండి. అది ఆరిపోయే వరకు కొన్ని నిమిషాలు వేచి ఉండండి. పసుపు క్యూబ్ మీ చర్మంపై ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. అలాగే, చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. పసుపుతో చేసిన ఐస్ క్యూబ్స్ ముడతలు, ఫైన్ లైన్స్, కళ్ల కింద డార్క్ పిగ్మెంటేషన్ వంటి వయస్సు సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది.కొన్ని కుంకుమ పువ్వులను తీసుకుని నీటిలో నానబెట్టండి. నీళ్లలో నానబెట్టిన కుంకుమపువ్వులో రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసుకుని గడ్డకట్టేలా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ క్యూబ్స్‌తో మీ ముఖానికి సహజమైన టోనర్‌గా ఈ ఐస్ క్యూబ్‌లను ఉపయోగించవచ్చు.కుంకుమపువ్వుతో ఐస్ క్యూబ్స్‌ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ట్యానింగ్, డార్క్ స్పాట్స్, మొటిమలు, పిగ్మెంటేషన్ నుండి బయటపడవచ్చు. అలాగే, ఇది స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.


దోసకాయ, నిమ్మకాయలు గొప్ప యాంటీఆక్సిడెంట్లు. ఇది మీ చర్మాన్ని క్లియర్‌గా, మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. ఈ ఐస్ క్యూబ్ రక్త ప్రసరణను పెంచుతుంది. మొటిమల కారణంగా ముఖం ఎర్రబడటాన్ని తగ్గిస్తుంది.ఒక కప్పు రోజ్ వాటర్, ఒక కప్పు సాదా నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఫ్రీజ్‌లో పెట్టుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌గా మారిన తర్వాత ఫేష్‌ ప్యాక్‌, లేదంటే మర్ధన చేసుకోవాలి.రోజ్ వాటర్ మీ మేకప్ తొలగించడానికి, మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. రోజ్ వాటర్ తో చేసిన ఐస్ క్యూబ్స్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. రిఫ్రెష్‌గా అనిపించేలా చేస్తుంది.ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులను చూర్ణం చేసి వేయాలి. ఆ తర్వాత దానికి రెండు టీస్పూన్ల ఆర్గానిక్ అలోవెరా జెల్ కలపండి. మిశ్రమం సిద్ధమైన తర్వాత ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఫ్రీజ్‌లో పెట్టుకోవాలి. ఐస్‌గా మారిన తర్వాత మెత్తని గుడ్డలో చుట్టి చర్మంపై స్మూత్‌గా మర్ధన చేసుకోవాలి.కలబంద మరియు తులసి మనకు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. ఇవి చర్మానికి, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలోవెరా అదనపు నూనెను తగ్గిస్తుంది. మొటిమలను నయం చేస్తుంది. అయితే తులసి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది చర్మానికి గొప్పగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పదార్థాలతో చేసిన ఐస్ క్యూబ్స్ చర్మానికి మేలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: