ఈ స్క్రబ్‌ తో అందంగా మెరిసిపోవడం ఖాయం?

Purushottham Vinay
మన అందాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చాలా శ్రద్ధ తీసుకుంటేనే చర్మం నిగారింపుతో ఇంకా చాలా యవ్వనంగా కనిపిస్తుంది.అయితే ఇది పోషకాలతో నిండిన శ్రద్ధ అయితే శరీరానికి మరింత అందం అనేది వస్తుంది. స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి మంచి నిగారింపు కూడా వస్తుంది.ఈ స్క్రబ్ వాల్ నట్స్ తో అయితే చర్మానికి మరింత నిగారింపు అనేది వస్తుంది. వాల్ నట్స్ లలో పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మానికి అద్భుతమైన నిగారింపును ఇచ్చి ధూళిని కూడా తొలగిస్తుంది. దాని ఫలితంగా మీ చర్మం అందంగా మారి మీరు చాలా యవ్వనంగా కనిపిస్తారు.ఈ వాల్‌నట్ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల దానిలోని పోషక గుణాల వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో సహాయపడతాయి. 


ఇతర చర్మ వ్యాధులతో పాటు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కొనేలా యాంటీమైక్రోబయాల్ ఏజెంట్లతో నిండి ఉంటాయి. దీన్ని ఉపయోగించడం వల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలను క్లియర్ చేసి, చర్మం స్మూత్‌గా అనిపించేలా చేస్తుంది. జుట్టు, చర్మానికి విటమిన్ ఇ ఆయిల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాల్‌నట్ స్క్రబ్స్‌లో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరిసేలా చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది.బొప్పాయి, వాల్ నట్ బాడీ స్క్రబ్ ని వాడటం వల్ల మృత చర్మ కణాలను రంధ్రాలనుంచి మురికిని బయటకు తీయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.ఇంట్లో వాల్‌నట్ స్క్రబ్‌ను ఎలా తయారు చేయాలి.వాల్‌నట్‌ పొడిలో తేనె, నిమ్మరసం కలపండి.మిశ్రమంతో మీ చర్మాన్ని మసాజ్ చేయండి.కంటి ప్రాంతంతో కాస్త సున్నితంగా రుద్దండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. వారంలో రెండుసార్లు స్క్రబ్ చేయడంవల్ల చర్మానికి సహజ ప్రకాశాన్ని తిరిగి తీసుకురావడంలో సహాయపడుతుంది.కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ స్క్రబ్ ని ట్రై చెయ్యండి. మంచి అందాన్ని ఇంకా యవ్వనాన్ని సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: