పులిపిర్లు ఇలా చేస్తే ఈజీగా తగ్గుతాయి?

Purushottham Vinay
ముఖంపై కొంతమందికి ఎర్రటి లేదా నల్లటి కాయలు అనేవి ఉంటాయి. సూరీడు కాయలుగా పిలిచే వీటివల్ల ముఖ అందం బాగా తగ్గిపోతుంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా వీటిని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.చాలామందికి ముఖంపై ఈ సూరీడు కాయల కారణంగా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు.అయితే వీటివల్ల ఆరోగ్యపరంగా ఏ విధమైన నష్టం లేకపోయినా కానీ అందం మాత్రం బాగా దెబ్బతింటుంది. ఇక చర్మంలో మెలానిన్ అనేది ఎక్కువైతేనే ఇవి పుట్టుకొస్తాయి. ఇంకొంతమందికి అయితే పుట్టుకతోనే ఇవి ఉంటాయి. ప్రతి ఇంట్లో లభించే వెల్లుల్లితో ఈ సమస్యను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లితో పాటు మరికొన్ని వస్తువులు కలిపి వినియోగిస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలుంటాయి.వెల్లుల్లి సహాయంతో మీ ముఖంపై లేదా మెడపై వచ్చే సూరీడు కాయల్ని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. వెల్లుల్లిని ఒలిచి ఒక 3-4 రెమ్మల్ని తీసుకోవాలి. తరువాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇక వాటిని సూరీడు కాయలపై రాసి బ్యాండేజ్ వేయాలి. దాదాపు 5-6 గంటల తరువాత నీళ్లతో బాగా శుభ్రంగా కడగాలి.


క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే అవి చాలా ఈజీగా తగ్గిపోతాయి. ముఖంపై వచ్చే వార్ట్స్ తొలగించేందుకు వెల్లుల్లితో పాటు ఉల్లిపాయల్ని కూడా మిక్స్ చేస్తే ఇంకా చాలా మెరుగైన ఫలితాలుంటాయి. ఈ రెండూ కూడా కలిపి బాగా పేస్ట్ చేసి రసం పిండాలి. అలాగే దూది సహాయంతో ఈ రసాన్ని వార్ట్స్‌పై కూడా రాయాలి. దాదాపు ఓ అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.ఇంకా ఆముదం నూనెను సాధారణంగా హెయిర్ గ్రోత్ అలాగే జుట్టు పటిష్టత కోసం వినియోగిస్తుంటాం. ఆముదం నూనెను వెల్లుల్లితో కలిపి కనుక వాడితే..మొటిమలు లేదా సూరీడు కాయలు చాలా ఈజీగా దూరమౌతాయి.అలాగే 2-3 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకుని ఆముదం నూనెను కొద్దిగా మిక్స్ చేయాలి.ఇంకా అలాగే రాత్రి పడుకునేముందు ఎక్కడైతే సూరీడు కాయలు లేదా పులిపిర్లు ఉన్నాయో అక్కడ వాటిని రాయాలి. తరువాత ఉదయం పూట శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: