ఈ చిట్కాతో అధిక బరువు తగ్గి స్లింగా ఫిట్ గా మారోచ్చు!

Purushottham Vinay
మనలో ఎవరైనా స్లిమ్‌గా, ఫిట్ గా ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. ఈ రోజుల్లో ముఖ సౌందర్యంతో పాటు శరీర సౌందర్యానికి కూడా చాలా ప్రాధాన్యత పెరుగుతోంది.ఇక బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నవారు తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు అన్నం తక్కువగా తినాలని అంటారు. కానీ అలా చేయడం అనేది అసలు అందరికీ కుదరని పని. అయితే అన్నం తింటూనే బరువు తగ్గే ఉపాయం కూడా ఒకటి ఉంది.బరువు తగ్గడం చాలా ముఖ్యం.. ఇక అన్నం కూడా తినలేకపోతే వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం చాలా మంచిది. బ్రౌన్ రైస్ తినడం వల్ల పొట్ట కొవ్వు చాలా త్వరగా తగ్గుతుంది. ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ రోజువారీ ఆహారంలో ఫైబర్ మొత్తాన్ని పెంచడం వల్ల శరీరంలోని కేలరీలు ఈజీగా 100 కేలరీలు తగ్గుతాయి.అలాగే వైట్ రైస్ తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.


ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ ఇంకా గోధుమలు వంటి తృణధాన్యాలు తినేవాళ్లు ఫిట్‌గా ఉంటారని కూడా చెబుతున్నారు.అలాగే బ్రౌన్ రైస్ తినడం జీవక్రియ ఇంకా జీర్ణక్రియకు కూడా మంచిది.బ్రౌన్ రైస్ తినే వారు ప్రతిరోజూ కూడా దాదాపు అరగంట పాటు స్పీడ్ వాక్ చేయడం చాలా మంచిది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా నియంత్రణలో ఉంటాయి. మీరు బ్రౌన్ రైస్ ఇంకా వ్యాయామాన్ని కొన్ని వారాలపాటు అనుసరిస్తే.. బెల్లీ ఫ్యాట్ కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది.బ్రౌన్ రైస్‌లోని ఫైబర్ ఇంకా అలాగే హోల్ గ్రెయిన్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీనిని తీసుకునే వ్యక్తులు గుండెపోటు ఇంకా కరోనరీ హార్ట్ డిసీజ్ లేదా ట్రిపుల్ నాళాల వ్యాధి ప్రమాదానికి దూరంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: