గుడ్ న్యూస్ : ఒక్క టాబ్లెట్ తో బట్టతలకు శాశ్వత పరిష్కారం!

Purushottham Vinay
చాలా మందిని బాగా వేధిస్తున్న బట్టతల సమస్యకు అమెరికా శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. వాళ్లు ప్రయోగం సక్సెస్ కావడంతో బట్టతల సమస్యకు మంచి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.అమెరికాకు చెందిన డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ అనే కంపెనీ.. బట్టతల ఉన్న వారందరికి గుడ్ న్యూస్ తెలిపింది. ఆ కంపెనికీ చెందిన సైంటిస్టులు ఓ ట్యాబ్లెట్ ని తయారు చేశారు. ఇక దాని పేరే సీటీపీ-543. ఈ ట్యాబ్లెట్ బట్టతల ఉన్న వారికి రోజుకు రెండు చొప్పున వారు ఇచ్చారు. దీంతో వారిలో మంచి ఫలితాలు అనేవి కనిపించాయి. ఈ మాత్రతో జుట్టు రాలడం ఆగడంతోపాటుగా ఇంకా అలాగే పోయిన జుట్టు మళ్లీ వస్తోందని గుర్తించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న 10 మందిలో నలుగురు సంవత్సరం వ్యవధిలో 80 శాతం కంటే ఎక్కువ జుట్టును తిరిగి పొందినట్లు కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తెలిపింది.కాగా ఈ డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్ అమెరికాలో దాదాపు 706 మంది బట్టతల వ్యక్తులపై ఈ ప్రయోగం చేసింది. అలాగే వారిని మూడు గ్రూపులుగా విభజించింది. ఇక ఒక గ్రూప్ లోని వారికి 8ఎంజీ ట్యాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఇవ్వగా… మరో గ్రూప్ వారికి రోజుకి రెండు సార్లు 12 ఎంజీ ట్యాబ్లెట్ ని ఇచ్చారు. 


ఇక దాదాపు 42శాతం మందిలో 12 ఎంజీ మోతాదు లేదా 8ఎంజీ మోతాదు తీసుకున్నారు. దీంతో 80శాతం లేదా అంతకంటే ఎక్కువ జుట్టు తిరిగి పెరగడంని వారు గమనించారు. అయితే కొంతమందిలో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించాయి. తలనొప్పి మొటిమలు వంటి దుష్ప్రభావాలు కూడా వచ్చాయి. ఇక ఇది సీటీపీ-543 అనే అలోపేసియా ఔషధం క్లినికల్ ట్రయల్స్ తుది దశలో ఉంది.ఇక బట్టతల నివారణకు ఎన్నో చికిత్సలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి ఇదో మైలురాయిగా మేము భావిస్తున్నామని.. ఇంకా ఈ బట్టతల బాధితులకు అత్యుత్తమ చికిత్సగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఈ ప్రయోగంలో దాదాపు సగం మందిలో ఆరునెలల్లో పూర్తి తల వెంట్రుకలు పెరిగినట్లు వారు గుర్తించడం జరిగింది. అలాగే ప్రస్తుత ప్రయోగదశలో ఉన్న ఈ మాత్ర జుట్టు రాలుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలను కూడా చిగురింపచేసింది. బట్టతల నివారణకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఇది మంచి మైలురాయిగా నిలుస్తుందని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: