చుండ్రు సమస్యను తగ్గించే ఆయుర్వేద టిప్స్..

Purushottham Vinay
చుండ్రు సమస్యను ఈజీగా తగ్గించాలంటే 1 బౌల్లో 1 టేబుల్ స్పూన్ మెంతి గింజల పొడి ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి, రాత్రంతా కూడా బాగా నానబెట్టండి. ఇక మరుసటి రోజున ఉదయం, మీ జుట్టుకు ఓ మంచి మాస్క్‌లా అప్లై చేసి, ఇక ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో బాగా శుభ్రం చేసుకోండి. మంచి ఫలితాలు రావడం కోసం వారానికి ఇలా ఒకటి లేదా రెండుసార్లు చేయండి.అలాగే ఒక గిన్నెలొ కొబ్బరి నూనెను తీసుకుని ఒక 2 నిమిషాలు పాటు వేడి చేయండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇక దానిని మీరు మీ జుట్టు మీద బ్రష్ చేసి ఇంకా హెయిర్ వాష్ చేయడానికి ముందు రాత్రిపూట లేదా 2 గంటల పాటు మీరు అలాగే ఉంచవచ్చు. ఇక ఇలా వారానికోసారి గనుక చేస్తే మీకు చుండ్రు సమస్య వెంటనే తగ్గుతుంది.అలాగే కొబ్బరి నూనెలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంతో పాటు 5 గ్రాముల మెంతిపొడిని కలపండి. ఇక మీ జుట్టును బ్రష్ చేసి రాత్రంతా కూడా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం పూట హెర్బల్ షాంపూతో మీ జుట్టును బాగా కడగాలి.

ఇక ఇలా కనుక వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీరు చుండ్రు సమస్య నుంచి వెంటనే ఉపశమనం అనేది పొందవచ్చు.ఇక అలాగే రెండు టేబుల్ స్పూన్ల పంచదార పాకంతో 1 కప్పు అలోవెరా జెల్ ని బాగా కలపండి. దీన్ని మీ తలకు పట్టించి ఇక రాత్రంతా కూడా అలాగే ఉంచి తరువాత మరుసటి రోజు ఉదయం బాగా కడగాలి. ఇక మంచి ఫలితాల కోసం వారానికోసారి ఇలా చేయండి.ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది.ఇక అలాగే ఒక కప్పు మెంతి గింజలను తీసుకొని వాటిని రాత్రంతా కూడా నీటిలో బాగా నానబెట్టండి. ఇక ఆ తరవాత గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి తరువాత దానికి 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఇక దీన్ని మీ తలకు బాగా పట్టించి 1 గంట పాటు అలాగే ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో మీ జుట్టును శుభ్రంగా కడగాలి. ఇక ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: