హీరోయిన్ లా మెరవాలి అంటే ఈ ఫుడ్ తప్పనిసరి..!!

Divya
సాధారణంగా హీరోయిన్ లా  మెరిసిపోయే చర్మం కావాలి అని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ముఖ్యంగా కృత్రిమ ఉత్పత్తులకు అలవాటు పడిన తరువాత అందమైన ముఖం కాస్త చాలా అందవిహీనంగా తయారవుతోంది. ఇక ముఖ్యంగా ముఖ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పనిసరిగా ముఖం మీద మొటిమలు, పగుళ్లు, ముడతలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన చర్మం కావాలి అంటే కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి, సూర్యరశ్మి వంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా  చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించడమే కాకుండా మనం అనుసరించే ఆహారం పైన కూడా చాలా ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి తినే ఆహారంపై పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
మన రోజు వారీ డైట్ లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే..
డార్క్ చాక్లెట్:
అద్భుతమైన చర్మ ప్రయోజనాలతో రుచికరమైన చిరుతిండి ఈ డార్క్ చాక్లెట్ అని చెప్పవచ్చు.. ఇందులో జింక్, ఐరన్, రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.. ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల చర్మం మీద చనిపోయిన చర్మకణాలు తొలగించడానికి డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది.. చర్మానికి మృదువైన ఆకృతి కూడా లభిస్తుంది.

అవకాడో:
దీనిని వెన్న పండు అని కూడా పిలుస్తుంటారు.. ఇందులో విటమిన్ ఎ , విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.. వీటిలో లభించే విటమిన్లు , కొవ్వులు చర్మాన్ని రిపేర్ చేసి మొటిమలు, ముడతలు వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకే వారానికి ఒకసారైనా ఈ అవకాడో తో తయారు చేసిన జ్యూస్ ను తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అక్రోట్లు (వాల్ నట్స్):
వీటిలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ఈ వాల్ నట్స్ తినడం వల్ల చర్మం మీద ముడతలు తగ్గి పోయి చర్మం రంగు పెరగడానికి కూడా సహాయపడతాయి..
బాదం ,జీడిపప్పు, గుడ్డు ,పిస్తా, కివి పండు , టోమాటో గ్రీన్ టీ వంటివి తింటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: