తస్మాత్ జాగ్రత్త: వీటిని తింటే బట్టతల రావడం ఖాయమట..!

Divya
ప్రస్తుత కాలంలో చాలా మంది మగవారు ఎదుర్కొంటున్న సమస్య బట్టతల.. ఈ బట్టతల సమస్య అనేది మగవారిలో సహజంగా మారిపోయింది. ఇక చిన్న వయసులోనే చాలా మందిలో ఈ సమస్య కనబడుతూ ఉండడం మనం గమనించవచ్చు. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా మగవారు హెయిర్ ఫాల్ సమస్య తో పాటు ఈ బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ బట్టతల రావడానికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయిన డస్ట్, పొల్యూషన్ కూడా కారణం కావచ్చు.

అయితే తాజాగా పరిస్థితులు మారడం వల్ల చిన్నవయసు వారు కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సమస్య మొదలైనప్పటి నుండి జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బట్టతల  సమస్య కారణంగా నుదుటిపై ఉండే జుట్టు కూడా పల్చబడుతుంది. ఇకపోతే 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండే వారు ఇంకా ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే వేటికి దూరంగా ఉంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

మనం తీసుకునే ఆహారం కూడా ఈ బట్టతల సమస్యకు కారణం అవ్వచ్చు. ఇక రోడ్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ,  జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. హై గ్లైసమిడ్ ఫుడ్  ను అధికంగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని ముఖ్యంగా యువత ఇలాంటి ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.. కాబట్టి త్వరగా బట్టతల వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక అందుకే వీలైనంత వరకు ప్రోటీన్ కలిగిన గుడ్లు, చేపలు వంటివి అధికంగా తినడం వల్ల ఇలాంటి జుట్టు రాలిపోయే సమస్యలు దూరం అవడంతో పాటు బట్టతల వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. మీరు కూడా ఇలాంటి సమస్య నుంచి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: