చలికాలంలో చర్మాన్ని జుట్టుని రక్షించే టిప్స్..

Purushottham Vinay
ఇక చలికాలంలో ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ఫేసును శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ముఖానికి మేకప్ ఉపయోగిస్తే ఇక మీరు రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్ ను తొలగించాలి. రాత్రి పూట ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని మురికి తొలగిపోతుంది. ఇక అంతేకాదు ముఖంపై మొటిమల సమస్య కూడా ఈజీగా తగ్గిపోతుంది.ఇక చలికాలంలో చర్మ సంరక్షణకు సీరమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మిల మిల మెరిసే చర్మానికి ఈ సీరం చాలా మంచిదని చాలా మంది భావిస్తారు. కాబట్టి చలికాలంలో రాత్రి పూట ముఖం కడుక్కున్న తర్వాత ముఖానికి ఖచ్చితంగా సీరమ్ రాసుకోవాలి. సీరమ్ అప్లై చేయడం వల్ల మీ ముఖంపై మొటిమలు సమస్య తొలగిపోతాయి.. ఇక అంతేకాదు మొటిమల సమస్య కూడా ఈజీగా తగ్గిపోతుంది. ఇక సీరమ్ చాలా తేలికగా కూడా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుకే రాత్రి వేళ చర్మ సంరక్షణ కోసం ఖచ్చితంగా సీరమ్ అప్లై చేసేయండి.

ఇక చలికాలంలో మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఖచ్చితంగా కొంత సమయాన్ని మీరు కేటాయించాలి. కాలుష్యం ఇంకా అలాగే హానికరమైన UV కిరణాల బారిన పడుతూ రోజూ మన చర్మం పలు కారణాల వల్ల బాగా పాడవుతూ ఉంటుంది. అందుకే చలికాలంలో వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా కాని చక్కని ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ ట్రై చేయండి. దీని వల్ల మీ చర్మ ఛాయ అనేది బాగా మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా మీరు మెరిసే చర్మం కావాలంటే చలికాలంలో రాత్రి పూట మీ చర్మ సంరక్షణ కోసం మాయిశ్చరైజింగ్ చేస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇంకా చలికాలంలో మీ జుట్టు చాలా పొడిగా మరియు గరుకుగా మారిపోతూ ఉంటుంది. ఇక ఇలా మీ జుట్టు పొడి బారకుండా ఉండేందుకు.. చలికాలంలో రాత్రి పూట గోరువెచ్చని నూనెతో మీ జుట్టుకు బాగా మసాజ్ చేయండి.ఇక వేడి నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మీ కురులు చాలా సున్నితంగా మారిపోతాయి. అలాగే రాత్రిపూట జుట్టుకు మసాజ్ చేసిన తర్వాత ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: