తేనెతో ఇలా చేస్తే పట్టులాంటి మెరుపు మీ సొంతం..

Purushottham Vinay
ప్రతి ఒక్కరు కూడా అందంగా వుండాలని ఇంకా అలాగే అందమైన ముఖం కోసం చాలా రకాలుగా ఎన్నో విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తూ వుంటారు.ఇక పట్టులాంటి మెరుపు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం.ఇక మీరు దాని కోసం తేనెను వాడటం చాలా ఉత్తమం. ఎందుకంటే తేనెలో అందానికి కావాల్సిన ఎన్నో పోషకాలు వున్నాయి. ఇక తేనెను మీ మోహం ఇంకా అలాగే చేతులకు కొద్దిగా తేనెను రాయండి. ఒక 5 నిముషాలు పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇక పొడి చర్మానికి కూడా తేనె చాలా మంచిది. ఈ మాస్క్ మీ చర్మానికి మంచి తేమను అందిస్తుంది.. కాబట్టి పొడి చర్మానికి తేనె అనేది చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.ఇక ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్‌లకు కూడా తేనె అనేది చాలా ముఖ్యమైన అంశం. అరటిపండు, గుడ్డు, నిమ్మకాయ, ఆరెంజ్ తొక్క ఇంకా అలాగే బొప్పాయితో తేనె మిక్స్ చేసి ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్‌ని మీరు ప్రయత్నించవచ్చు.

తేనె మీ చర్మాన్ని ఎంతో మృదువుగా చేస్తుంది. ఇక ఈ ఫేస్ ప్యాక్ మొటిమలు, మచ్చలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.అలాగే అధిక బరువు తగ్గేందుకు కూడా తేనె చాలా ఉపయోగపడుతుంది.ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ తేనె ఇంకా నిమ్మరసం బాగా కలపండి.ఆ తర్వాత బాగా మిక్స్ చేసి దాన్ని తాగాలి. ఇది మీ బరువుని తగ్గించే ఓ ఏజెంట్‌గా పని చేస్తుంది.అలాగే తేనె ఓ సహజ స్వీటెనర్. ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. అందుకే ఇది మీ కొవ్వును కాల్చేస్తుంది.ఇక పాదాలకు కూడా తేనెను ఇలా వాడండి. ఇక ఒక గిన్నెలో కొంచెం తేనె తీసుకుని అందులో పెరుగుని వేయాలి. తరువాత దీన్ని మీ పాదాలకు అప్లై చేయండి.ఒక 10 నిమిషాలు పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది మీ పాదాల పగుళ్లను నయం చేస్తుంది. అలాగే మీ పాదాలను కూడా పోషిస్తుంది.అంతేగాక ఇది మీ పాదాలకు మంచి విశ్రాంతిని కూడా ఇస్తుంది. ఇది పాదాలకు మంచి చికిత్సగా కూడా బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: