స్ట్రాబెర్రితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం..

Purushottham Vinay
ముఖం మిల మిల మెరిసిపోవాలంటే ఒక టేబుల్ స్పూన్ బేసన్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ గుజ్జు అలాగే ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేయండి. ఇక తర్వాత ఆ పేస్ట్‌ను మీ ముఖానికి బాగా పట్టించి ఒక 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో బాగా శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇక బేసిన్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేవి ఉంటాయి, ఇది చర్మాన్ని చాలా లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే బేసిన్‌లోని జింక్ బ్యాక్టీరియాతో బాగా పోరాడుతుంది. బేసిన్ చర్మంలో వుండే అదనపు నూనెను నియంత్రించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా మారుతుంది.అలాగే మరోవైపు, స్ట్రాబెర్రీలతో బేసన్ మిక్స్ చేయడం వల్ల మొటిమల సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇది చర్మం కాంతివంతంగా ఇంకా ఎంతో మృదువుగా ఉండటానికి బాగా సహాయపడుతుంది.

ఇలా మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్‌ని వారానికి ఒకసారి ముఖానికి ఉపయోగించండి.ఇక అలాగే స్ట్రాబెర్రీ ప్యూరీతో ఒక పరిమాణంలో తాజా క్రీమ్ లేదా పెరుగు ఇంకా ఒక టీస్పూన్ తేనెను కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోండి. జిడ్డుగా వున్న చర్మం కోసం, ఈ మాస్క్‌ను తయారు చేయడానికి తాజా క్రీమ్‌కు బదులుగా పెరుగును కలపండి. ఇక మొటిమలను తగ్గించడంలో ఈ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది.కొన్ని స్ట్రాబెర్రీలను బాగా గ్రైండ్ చేసి ఇక అందులో ఒక టీస్పూన్ తేనెను వేసి బాగా కలపండి. ఇక ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి బాగా పట్టించి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని బాగా కడిగేయాలి. తేనెలో యాంటీ-ఆక్సిడెంట్లు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి, ఇది చర్మపు మలినాలను ఇంకా మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: