అందమైన చర్మం కోసం ఇలా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.. ?

VAMSI
స్త్రీలైనా పురుషులైనా అందంగా కనిపించాలని ముఖానికి ఎన్నో మెరుగులు దిద్దుతుంటారు. అందరిలోనూ ఆకర్షణీయంగా తెల్లని చర్మంతో మరిచిపోవాలని తహతహలాడుతుంటారు. మాములుగా స్త్రీలు వారి చర్మ సౌందర్యంపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. తెల్లని రంగుతో తమ చర్మం మెరిసిపోవాలని ఆశపడుతుంటారు. నిజానికి తెల్లని చర్మం ఉన్నా వారు ఎంత మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తూ ఎంతో ఆకర్షణీయంగా కనబడుతారు. అందుకే తెలుపు అనే మాట అందరికీ అంత ఇష్టం . తెల్లని చర్మం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు క్రీములు, ఫేస్ ప్యాక్ రకరకాలుగా ట్రై చేస్తుంటారు. ఖరీదు ఎక్కువైనా ఎంత కాస్ట్లీ అయినా చర్మం రంగు మారుతుంది వాడేస్తుంటారు.
అయితే కృత్రిమంగా తయారుచేసిన ఫేస్ క్రీమ్ లు ఏవైనా సరే తాత్కాలికంగా అందమైన చర్మాన్ని ప్రసాదించినా అవి మన సహజమైన అందం యొక్క కోమలత్వాన్ని పోగొడతాయి, సౌందర్య గుణాలను తగ్గిస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలిసినప్పటికీ  తాత్కాలికంగా తెల్లగా కనిపించాలనే ఆలోచన ముందు ఇవేమీ పెద్ద సమస్యగా అనిపించవు. అందుకే చిన్నతనం నుండే మన చర్మ సౌందర్యం విషయంలో కొన్ని సహజమైన చిట్కాలతో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే  మన ముఖం ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. చిన్నప్పటి నుండే సున్నిపిండిని ముఖానికి అలాగే ఒంటికి రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. టొమాటో, పపాయ వంటి వాటి గుజ్జును కనీసం వారానికి రెండు సార్లు అయినా ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి.
ఇక పెద్ద వాళ్లకు ఎంతగానో ఉపయోగపడే సహజమైన ఫేస్ ప్యాక్ లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మంలో తేమను పెంచి మెరిసేలా చేస్తుంది. అంతేకాదు చర్మంపై మరియు శరీరంపై ఉండే మచ్చలను తొలగించడంతో కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది.  సహజమైన అందాన్ని పెంచేందుకు ఒక అద్భుతమైన చిట్కా. రెండు టీ స్పూన్ల శనగపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఒక స్పూన్ వద్దకు నిమ్మరసాన్ని వేసి, చిటికెడు పసుపు కూడా వేసి బాగా పేస్ట్ లా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ చేసుకుంటూ పట్టించాలి. ఒక పదిహేను నిమిషాలు ఆగి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి వారం ఒకటి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. రెండు టీ స్పూన్ల శనగపిండి ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక టమోటా గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే మంచి ఫలితాన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: