15 నిముషాల్లో అందమయిన ముఖం మీ సొంతం...

VAMSI
పార్టీకి వెళ్లాలా, స్పెషల్ గా కనిపించాలా అది కూడా పది పదిహేను నిముషాల్లోనే మీ ముఖం చక్కగా తయారవాలని కోరుకుంటున్నారా అయితే ముల్తానీ మట్టి వాడాల్సిందే. చర్మ సౌందర్యానికి ప్రయత్నించే మార్గాలు ఎన్నో ఫేస్ ప్యాక్ లు, క్రీములు యూజ్ చేస్తుంటే మరికొందరు ఇంట్లో అందుబాటులో ఉండే టొమాటో, పాలు, తేనె, సెనగ పిండి వంటి వాటిని వాడుతుంటారు. అయితే ముఖం అందంగా కనిపించడానికి ముల్తానీ మట్టి అనే పౌడర్ ని కూడా వాడుతుంటారు. ఈ పేరు దాదాపుగా అందరూ వినే ఉంటారు. ఇది చర్మ సౌందర్యానికి చాలా మేలును చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవని నిపుణులు చెబుతున్న మాట.
ముల్తానీ మట్టి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకుని ఒక 15, లేదా 20 నిముషాల తరువాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే చాలు, మీ అందం ఇక రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ముల్తానీ మట్టిని బాగా మసాజ్ లా చేస్తూ ముఖానికి అప్లై చేసుకోవడం వలన చర్మ రంధ్రాల్లో పేరుకు పోయిన మురికి తొలగిపోతుంది. అంతే కాదు చర్మం చాలా మృదువుగా తయారవుతుంది. అంతేకాక చర్మంలో కొత్త మెరుపు కొత్త కాంతి కనబడుతుంది. ఇది చాలా వేగంగా ఫలితాన్ని అందిస్తుంది. పూసుకున్న వెంటనే  మార్పు అనేది స్పష్టంగా మీకే కనిపిస్తుంది.
ముల్తానీ మట్టిలో ఇనుము, క్వార్ట్జ్, సిలికా,  కాల్షియం, మెగ్నీషియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు అధికంగా ఉండటం వలన చర్మం మంచి రంగు లోకి రావడానికి, చర్మంపై ఉన్న జిడ్డు పోయి బ్రైట్ గా రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ముల్తానీ మట్టిలో కాస్త గందం పొడి వేసి, తగినన్ని పాలు పోసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఒక పదిహేను నిముషాలు ఆగి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు వరకు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: