ఈ పండుతో స్లిమ్ గా అందంగా మెరిసిపోవడం ఖాయం..

Purushottham Vinay
స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటే చూడ్డానికి చాలా అందంగా వుంటారు. అలాగే బాగా మెరిసిపోతూ కనిపిస్తూ వుంటారు. ఇక అలా స్లిమ్ అండ్ ఫిట్ గా అందంగా మెరిసి పోయేలా ఉండాలంటే మీరు తినే తిండిలో అత్తి పండుని డైట్ గా చేసుకోండి. ఇక కొన్ని రోజుల్లోనే అధిక బరువు తగ్గి చాలా అందంగా కనపడతారు.ఇక ఒక పెద్ద ముడి అంజీర్‌ 2,000 కేలరీల ఆహారం ఆధారంగా 1.9 గ్రాముల డైటరీ ఫైబర్‌ను అందిస్తుందని నిపుణులు చెప్పడం జరిగింది.ఇక ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అది ఊబకాయం రాకుండా ఎంతగానో సహాయపడుతుంది. ఇక మీరు మీ అల్పాహారంలో ఎక్కువ ఫైబర్ తృణధాన్యాలు ఇంకా అలాగే అంజీర్‌ పండ్ల ముక్కలను కూడా జోడించవచ్చు లేదా పాలకూర- చికెన్ సలాడ్‌కి చిన్న ముక్కలు అంజీర్‌ కూడా జోడించుకోని తినవచ్చు.ఇక అలాగే ఒక పెద్ద అంజీర్‌లో 47 కేలరీలు అనేవి ఉంటాయి. ఇక అంజీర్‌ పండ్లను రోజూ తినడం ద్వారా మీ కేలరీల వినియోగాన్ని తగ్గించడం వల్ల మీరు చాలా ఈజీగా బరువుని తగ్గవచ్చు.
ఇక ఇది కాకుండా మీరు అంజీర్‌ను చిరుతిండిగా తీసుకోవడం వల్ల మీకు కొంచెం కడుపు నిండినట్లు అనిపిస్తుంది.ఇక దీని వలన ఇది అనవసరమైన క్యాలరీ ఫుడ్స్ ని తీసుకోవడం నుండి మిమ్మల్ని కాపాడటం జరుగుతుంది.ఇక అలాగే మీరు ఎండిన అంజీర్‌ పండ్లను లేదా ప్రాసెస్ చేసిన అంజీర్‌ లు కాకుండా తాజా అత్తి పండ్లను మాత్రమే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇక ఎండిన అత్తి పండ్ల కంటే కూడా తాజా అత్తి పండ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే ఈ పండులో తీపి కూడా ఉంటుంది. ఇక మీరు ఎండిన లేదా ప్రాసెస్ చేసిన అంజీర్‌ పండ్లను కనుక తింటే ఇది బరువు తగ్గడానికి ఒక తప్పు ఎంపిక కావచ్చు. ఇక ఇందులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది.ఇక ఇందులో పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి.ఇంకా ఎక్కువ కేలరీలు కూడా ఉంటాయి. ఇక అదనంగా ఇంకా అలాగే ప్రాసెస్ చేయబడిన ఫిగ్-బార్‌లు తాజా అంజీర్‌ పండ్ల కంటే ఎక్కువ కేలరీలు ఇంకా చక్కెరను కూడా కలిగి ఉంటాయి. ఇక ఇవి రెండు కుకీలలో 198 కేలరీలు లేదా 26 గ్రాముల చక్కెర వరకు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: