చలి కాలంలో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
వీలైనన్ని సార్లు గోరు వెచ్చటి నీటితో సబ్బు అప్లై చేయకుండా శుభ్ర పరుచుకోవాలి . ప్రతి రోజూ రాత్రి పడుకోవడానికి ముందు గోరు వెచ్చని నీటిని తీసుకుని కాటన్ క్లాత్ లేదా కాటన్ ను ఆ నీటిలో ముంచి ముఖాన్ని నీటిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రెండు సార్లు చేయాలి. అనంతరం మంచి కోల్డ్ క్రీమ్ లేదంటే మాయిశ్చైజర్ అయినా సరే ముఖానికి నిదానంగా రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వలన మీ చర్మం పొడిబారడం తగ్గుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు మీ పెదవులకు పాల మీగడ కానీ, వెన్న కానీ రాయడం వలన పెదాలు పగలడం పూర్తిగా తగ్గిపోతాయి.
అంతే కానీ ఏమైనా కెమికల్స్ తో కూడిన పదార్ధాలను వాడి మీ చర్మాన్ని పాడు చేసుకోకండి. ఇదే విధంగా మీ చర్మానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి. మరియు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా ఆకు కూరలు, కూరగాయలలో సి విటమిన్ పుష్కలంగా లభించే వాటిని తీసుకోవడం కారణంగా చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు, చర్మం మరింత ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మ సమస్యలు చిన్నవి అయితే ఓకె కానీ, మీకు పెద్దవిగా అనిపిస్తే మాత్రం సంబంధిత డాక్టర్ ను కన్సల్ట్ అవడం ప్రధానం.