మీ ముఖం జిడ్డుగా ఉందా... ఈ చిట్కా ట్రై చేయండి ?

VAMSI
తెల్లగా కనిపించాలని, మంచి రంగుతో అందరిలోనూ ఆకర్షణీయంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే కొందరు చామన చాయ రంగులో ఉన్నప్పటికీ ముఖంపై ఏర్పడే జిడ్డు కారణంగానో లేక ఎండలో తిరగడం వలనో ఉన్న రంగు కూడా పోతుంది. మరి కొందరు ముందు నుండే కాస్త రంగు తక్కువగానే ఉంటారు. ఇలాంటి వారు ముఖం మంచి రంగులోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు కనుక పాటిస్తే మెరుగైన ఫలితాల్ని పొందుతారు. వెంటనే నిమ్మపండు రంగులో మెరిసి పోతారని చెప్పలేము కాని మెల్లగా మీ ముఖం అందంగా మారుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను. ఇపుడు ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం.
* బొప్పాయి పండు ఆరోగ్యమైన చర్మానికి చాలా మంచిది. ఈ పండును తిన్నా లేక జ్యూస్ లా తాగినా లేక ముఖానికి రాసుకున్నా మీ  చర్మ సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఒక గిన్నెలోకి బొప్పాయి గొజ్జును నాలుగైదు టేబుల్స్ స్పూన్లు తీసుకోవాలి, అందులో నిమ్మరసం మరియు  ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపిండి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సర్కిల్ షేప్ లో ముఖానికి బాగా పూయాలి. ఇరవై నిముషాలు ఆగి చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
* బొప్పాయి మరియు కోడిగుడ్డు కూడా చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.  కోడి గుడ్డు లోని తెల్లసొనను కొంత తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్‌ వరకు బొప్పాయి గుజ్జును వేసి  బాగా మిక్స్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని  ముఖానికి పట్టించాలి. దాదాపు అరగంట వరకు ఉంచి చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు సార్లు వరకు చేయొచ్చు. ఇలా చేయడం వలన మంచి రంగు మాత్రమే కాదు, ముఖంలో కాంతి పెరుగుతుంది, ముఖంపై ముడతలు కూడా త్వరగా రావు.  కావున మీరు ఈ రోజు నుండి ఈ చిట్కాలు వాడి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: